Advertisementt

కేసీఆర్‌ కొత్త పత్రిక పేరు 'తెలంగాణ టుడే'..!!

Sat 07th Mar 2015 06:09 AM
kcr,telangana today,new english paper,media  కేసీఆర్‌ కొత్త పత్రిక పేరు 'తెలంగాణ టుడే'..!!
కేసీఆర్‌ కొత్త పత్రిక పేరు 'తెలంగాణ టుడే'..!!
Advertisement
Ads by CJ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్యామిలీ మీడియా విస్తరణపై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే కేసీఆర్‌కు టీ న్యూస్‌ చానల్‌, నమస్తే తెలంగాణ దినపత్రిక ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నమస్తే తెలంగాణ పత్రిక ఏడు ఎడిషన్లతో నం. 3 స్థానంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రచురితమవుతోంది. ఇక ప్రభుత్వ వాణిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మీడియా అవసరం దృష్ట్యా ఇప్పుడు కేసీఆర్‌ మరో పేపర్‌ను కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'తెలంగాణ టుడే' పేరుతో ఓ ఆంగ్ల దినపత్రికను కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. రంగుల పేజీలతో, కొన్ని ఎడిషన్లతో తెలంగాణ టుడే పత్రికను త్వరలోనే ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సాక్షి, ఈనాడు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు ప్రచురిస్తున్నట్లు వాదనలు వినబడుతున్నాయి. ఈ తరుణంలో మరో దినపత్రికను కూడా కేసీఆర్‌ ప్రారంభిస్తే ఆయన మీడియాపై పూర్తి ఆధిపత్యం సాధించే అవకాశం ఉంది.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ