Advertisementt

'టెంపర్' వసూళ్లు ఎంత..?

Mon 23rd Feb 2015 04:59 AM
temper movie,sachin joshi,ramanaidu,badhsha,60 crores  'టెంపర్' వసూళ్లు ఎంత..?
'టెంపర్' వసూళ్లు ఎంత..?
Advertisement
Ads by CJ

‘టెంపర్‌’ చిత్రం మంచి సినిమాగా, కోట్లు కొల్లగొడుతున్న చిత్రంగా అందరూ ఒప్పుకుంటారు. కానీ ఈ చిత్రానికి ఘోస్ట్‌ ప్రొడ్యూసర్‌ అయిన సచిన్‌జోషి మాత్రం ఈ చిత్రం రెండు వారాల్లో 60కోట్లు వసూలూ చేయడం ఖాయం అంటున్నాడు. అయితే ఈ చిత్రం కలెక్షన్లు ఇప్పటికే బాగా తగ్గాయి. అందులోనూ రామానాయుడు మృతి వల్ల కొంత నష్టం జరిగింది. కీలకమైన ఓ రోజు కలెక్షన్లు నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రం 45నుండి 50కోట్ల వరకు మాత్రమే వసూలు చేసే సీన్‌ ఉందని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. అంతేకాదు... ఈ చిత్రం కేవలం ‘బాద్‌షా’  రేంజ్‌లోనే ఉంటుందని, అయితే బడ్జెట్‌ విషయంలో కాస్త నియంత్రణ పాటించడం వల్ల బయ్యర్లకు కొద్దిపాటి స్వల్ప లాభాలు మాత్రమే వస్తాయని ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలు సచిన్‌జోషి చెప్పిన 60కోట్లు అనేవి గ్రాసా? లేక షేరా? అని వారు ప్రశ్నిస్తున్నారు...!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ