Advertisementt

నెరవేరని రామానాయుడు మూడు కోర్కెలు..!

Fri 20th Feb 2015 05:20 AM
ntr,ramudu bheemudu,ramanaidu,director wish,family movie  నెరవేరని రామానాయుడు మూడు కోర్కెలు..!
నెరవేరని రామానాయుడు మూడు కోర్కెలు..!
Advertisement
Ads by CJ

తన జీవితంలో తాననుకున్న కోరికలన్నింటిని తీర్చుకొన్న మూవీమొఘల్‌ రామానాయుడు చివరి మూడు కోరికలు పూర్తికాకుండానే ఆయన పరమపదించడం బాధాకరం. ఆయన ‘రాముడు`భీముడు’ చిత్రాన్ని జూనియర్‌ ఎన్టీఆర్‌తో తీయాలని భావించారు. దీనికి సంబంధించి ఎన్టీఆర్‌తో సంప్రదింపులు కూడా జరిపాడు. కొన్నేళ్ల కిందట ఆ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ... ‘రాముడు `భీముడు’ చిత్రాన్ని ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులతోనే నిర్మించాలి. వారి కుటుంబసభ్యులు మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేయగలరు... అన్నాడు. ఇక ఆయన రెండో కోరిక డైరెక్షన్‌ చేయడం. ఆయన ఒక్కచిత్రానైనా తానే డైరెక్షన్‌ చేయాలని భావించారు. తెర వెనుక ఉండి ఎన్నో సినిమాలకు దిశానిర్దేశం చేసినప్పటికీ పూర్తిస్థాయిలో తన పేరే డైరెక్టర్‌గా వేసుకోవాలనేది ఆయన రెండో కోరిక. ఇక తన కొడుకులు, మనవళ్లతో కలిసి అందరూ ఓ చిత్రంలో చేయాలని ఆయన కలగన్నారు. కానీ అది కూడా నెరవేరలేదు. ఇలా.. రామానాయుడు గారి చివరి మూడు కోరికలు తీరకపోవడం బాధాకరం.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ