Advertisement

సెంటిమెంట్లు వర్కవుట్ అవుతాయా..!

Wed 18th Feb 2015 02:03 AM
ram charan,allu arjun,balakrishna,sentiments  సెంటిమెంట్లు వర్కవుట్ అవుతాయా..!
సెంటిమెంట్లు వర్కవుట్ అవుతాయా..!
Advertisement

టాలీవుడ్ లో సెంటిమెంట్ల వర్షం ఎక్కువైపోతుంది. స్టార్ హీరోలు సైతం తమ హిట్ సినిమా ఏ నెలలో రిలీజ్ అయిందో అదే నెలలో వారి అప్ కమింగ్ మూవీస్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ నటిస్తున్న 'మై నేమ్ ఈస్ రాజు' సినిమాను తన 'గోవిందుడు అందరి వాడెలే' సినిమా రిలీజ్ చేసిన నెలలోనే రిలీజ్ చేయనున్నాడన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ హీరోస్ అల్లు అర్జున్, నందమూరి బాలకృష్ణ తాము నటిస్తున్న 'సన్ ఆఫ్ సత్యమూర్తి' , 'లయన్' సినిమాలను తమకు హిట్స్ ఇచ్చిన సినిమాలు రిలీజ్ చేసిన రోజునే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ కు 'రేసుగుర్రం' ఏప్రిల్ లో, బాలయ్య కు లెజెండ్ ఫిబ్రవరి నెలలో సూపర్ హిట్లు గా నిలిచాయి. అదే సెంటిమెంట్ తో బాలకృష్ణ 'లయన్' ఈ నెల చివరి వారంలో, అల్లు అర్జున్ 'సన్ ఆఫ్ సత్యమూర్తి' ఏప్రిల్ రెండవ వారంలో రిలీజ్ చేయబోతున్నారు..! సో ఈ విధంగా మన హీరోలు సెంటిమెంట్లు ఫాలో అవుతున్నారన్న మాట..!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement