Advertisement

రామ్ సరసన కొత్త హీరోయిన్ ఎవరంటే..!

Tue 17th Feb 2015 06:45 AM
chirutha fame,neha sharma,ayesha sharma,ram  రామ్ సరసన కొత్త హీరోయిన్ ఎవరంటే..!
రామ్ సరసన కొత్త హీరోయిన్ ఎవరంటే..!
Advertisement

మెగా పవర్  స్టార్ రామ్ చరణ్ నటించిన తొలి చిత్రం  'చిరుత'. పూరీజగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా నేహా శర్మ నటించింది. ఆ తర్వాత ఆ అమ్మడు వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన 'కుర్రాడు' చిత్రంలో కూడా నటించింది. ఇప్పుడు తెలుగులో అవకాశాలు లేక అప్పుడప్పుడు బాలీవుడ్ చిత్రాల్లో కనిపిస్తున్న నేహా శర్మ ప్రస్తుతం తన సోదరిని టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం చేస్తుంది. ఆమె పేరు ఆయేషా శర్మ. ఈమె యంగ్ హీరో రామ్ నటించనున్న తాజా చిత్రం 'శివం' చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. ఆమెకు ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఆమె యాక్టింగ్, కధక్, వాయిస్ మాడ్యులేషన్ వంటి వాటిల్లో ట్రైనింగ్ తీసుకుంది. మరి ఈమె నేహా శర్మ లా ఒకటి రెండు చిత్రాలకే పరిమిత కాకుండా హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుందో  లేదో చూడాలి...! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement