మహేష్ కి 'దమ్కీ' ఇవ్వనున్న పూరి..!

Tue 17th Feb 2015 05:55 AM
mahesh babu,poorijagannath,damki,ha-trick movie  మహేష్ కి 'దమ్కీ' ఇవ్వనున్న పూరి..!
మహేష్ కి 'దమ్కీ' ఇవ్వనున్న పూరి..!
Advertisement
Ads by CJ

గత కొంతకాలంగా సరైన హిట్ లేక డీలాపడిపోయిన డైరెక్టర్ పూరీజగన్నాధ్ 'టెంపర్' చిత్రంతో మరలా గర్జించాడు. దీంతో ఆయన చేయబోయే తదుపరి చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొనివుంది. త్వరలో పూరీ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. గతంలో 'పోకిరి, బిజినెస్ మెన్' చిత్రాలతో వరుసగా రెండు హిట్స్ సాధించిన ఈ జోడీ హ్యాట్రిక్ మూవీగా కొత్త చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి 'దమ్కీ' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ టైటిల్ ను త్వరలోనే  ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించనున్నట్లు సమాచారం. ఇప్పటినుండే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉండటంతో పూరీ ఈ చిత్రం విషయంలో మరింత ఆచితూచి అడుగులు వేయనున్నాడట. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ