Advertisementt

జూనియర్ మాటలు నిజమవుతున్నాయి..!

Mon 16th Feb 2015 07:27 AM
junior ntr,temper,patas,balakrishna,lion  జూనియర్ మాటలు నిజమవుతున్నాయి..!
జూనియర్ మాటలు నిజమవుతున్నాయి..!
Advertisement
Ads by CJ

‘టెంపర్‌’ మూవీ రిలీజ్‌కు ముందు ఈ సినిమా గురించి జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎక్కువగా మాట్లాడలేదు. అయితే ‘పటాస్‌’ చిత్రం ఘనవిజయం నేపథ్యంలో ఈ ఏడాది నందమూరి నామ సంవత్సరం అవుతుందనే ఆశాభావాన్ని వెల్లడిరచాడు. అనుకున్నట్లు గానే ‘టెంపర్‌’తో అది నిరూపించాడు. ఇక బాబాయ్‌ ‘లయన్‌’ విజయం ఒక్కటే మిగిలి ఉంది. అది కూడా ఘనవిజయం సాధిస్తే ఎన్టీఆర్‌ మాట నిజమవుతుంది. వాస్తవానికి ‘టెంపర్‌’ సినిమాకు ముందు పూరి జగన్నాధ్‌, ఎన్టీఆర్‌కు ఓ హిట్‌ ఇస్తే చాలని అభిమానులు అనుకున్నారు. కానీ పూరీ ఏకంగా ఎన్టీఆర్‌కు సూపర్‌డూపర్‌ హిట్‌ని ఇచ్చాడు. ఈ చిత్రానికి ప్రేక్షకులు, అభిమానుల నుండే కాక రాజమౌళితో పాటు పలువురు సినీ సెలబ్రిటీల ప్రశంసలు సైతం లభిస్తున్నాయి. ఎన్టీఆర్‌ను అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సరైన సినిమా పడితే ఎన్టీఆర్‌ ఎలా రెచ్చిపోతాడో? ఎన్టీఆర్‌ నిరూపించాడు. వాడుకునే వాడు ఉండాలే కానీ, ఎన్టీఆర్‌ రేంజ్‌ ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి ప్రూవ్‌ చేశాడు. ఈ చిత్రం ఎన్టీఆర్‌ కెరియర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలస్తుందని, దీంతో ఎన్టీఆర్‌ 50 కోట్ల క్లబ్‌లో చేరడం భాయమని ట్రేడ్‌ వర్గాలు ఢంకాభజాయిస్తున్నాయి. మంగళవారం మహాశివరాత్రి కూడా కలిసి రావడంతో బాక్సాఫీస్‌ వద్ద ‘టెంపర్‌’ హవా కొనసాగనుంది. అంతేకాక, మరో నెల పాటు భారీ చిత్రాల విడుదల లేకపోవడంతో ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’కు ఇక తిరుగే ఉండదని అంటున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ