Advertisementt

వద్దు పూరి వద్దు..!

Mon 16th Feb 2015 07:24 AM
poorijagannath,temper,hindi remake,bandla ganesh  వద్దు పూరి వద్దు..!
వద్దు పూరి వద్దు..!
Advertisement
Ads by CJ

పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన 'టెంపర్' సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సంపాదించుకుంది. దీంతో దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రం హిందీ రీమేక్ డైరెక్ట్ చేసేది కూడా పూరి నే అని నిర్మాత బండ్ల గణేష్ అధికారికంగా వెల్లడించారు. టాలీవుడ్ లో వరుస హిట్స్ కొట్టి అమితాబ్ ను డైరెక్ట్ చేసే అవకాశం రాగానే ఉత్సాహంతో బాలీవుడ్ వైపు వెళ్ళాడు పూరి. ఆ తరువాత తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు నిరాశనే మిగిల్చాయి. మరి ఇప్పుడే తెలుగులో హిట్ కొట్టిన పూరి బాలీవుడ్ వైపు వెళ్ళడం ఎంత వరకు సమంజసం అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. ప్రస్తుతం ఒక భాషలోనే సినిమాలను తీయడంపై పూరి కాన్సంట్రేట్ చేస్తే 'టెంపర్' తో స్టార్ట్ అయిన హిట్ ట్రాక్ ను కొన్ని సినిమాల వరకు కంటిన్యూ చేయగలుగుతాడు. ఆ తరువాత బాలీవుడ్ గురించి ఆలోచిస్తే మంచిది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ