Advertisementt

హీరోయిన్‌ ఇంట్లో దొంగలు పడ్డారు..!!

Thu 12th Feb 2015 11:31 AM
poonamkour,jewellerry,robbery,upcoming films  హీరోయిన్‌ ఇంట్లో దొంగలు పడ్డారు..!!
హీరోయిన్‌ ఇంట్లో దొంగలు పడ్డారు..!!
Advertisement
Ads by CJ

హీరోయన్‌ పూనమ్‌ కౌర్‌ ఇంట్లో చోరీ జరిగింది. ఆమె ఇంట్లో దొంగలు పడి సుమరు రూ. ఐదున్నర లక్షల విలువ చేసే వజ్రాల హారాన్ని ఎత్తుకెళ్లారు. అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు. కొద్ది రోజుల క్రితం బాంద్రా వెళ్లినప్పుడు పూనమ్‌కౌర్‌ ఈ వజ్రాల హారం ధరించారట. అయితే అది ఆమె సొంతం కూడా కాదని, ఓ నగల దుకాణం నుంచి అరువు తెచ్చుకున్నట్లు సమాచారం. తీరా దుకాణానికి ఆ హారాన్ని అప్పగించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ ఆభరణం కోసం ఇంట్లో వారు వెతికినా లభించలేదు. దీంతో చేసేది లేక పూనమ్‌ కౌర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరి ఆ నగను బయటినుంచి  వచ్చిన దొంగలు చోరీ చేశారా..? లేక ఇంట్లోని వ్యక్తులు తీశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలె అవకాశాలు సన్నగిల్లి కష్టాల్లో ఉన్న పూనమ్‌కౌర్‌ ఆభరణం మిస్‌ కావడం మరో తలనొప్పిగా మారింది.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ