పూరి సెంటిమెంట్ ను బ్రేక్ చేయనున్నాడా..!

CineJosh news

సాధారణంగా పూరిజగన్నాథ్ సినిమా అంటే అందులో కమెడియన్ అలీ ఖచ్చితంగా ఉంటాడు. ఆయన కోసం పూరి అవసరమైతే ఓ పాత్రను సృష్టిస్తాడు. లేకపోతే కథతో సంబంధం లేకపోయినా ఓ సపరేట్ కామెడి ట్రాక్ ను అలీ కోసం పెడతాడు. ఇక బ్రహ్మానందం కూడా పూరి సినిమాలో మంచి పాత్రలు పోషిస్తుంటాడు. ఇక పూరి సినిమాలో అలీ-బ్రహ్మానందం ఉన్నారంటే ఇక ఎంటర్ టైన్మెంట్ కు డోకా ఉండదు అనేది పూరి అభిమానుల అభిప్రాయం. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ తో పూరి తీస్తోన్న 'టెంపర్' చిత్రంలో అలీ, బ్రహ్మానందం ఇద్దరు లేరని తెలుస్తోంది. అదే నిజమైతే పూరి మొత్తానికి తన సెంటిమెంట్ ను తానే బ్రేక్ చేస్తున్నాడని చెప్పుకోవాలి. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే 13 వ తేదీ వరకు ఆగాలి..!

poorijagannath
temper
ali
brahmaanandam