Advertisementt

సునీల్ కు మలుపు తిరిగేనా..!

Fri 06th Feb 2015 12:56 AM
sunil,malupu,nikki gaarla,comedy entertainer,vasu varma  సునీల్ కు మలుపు తిరిగేనా..!
సునీల్ కు మలుపు తిరిగేనా..!
Advertisement
Ads by CJ

'బుజ్జిగాడు' ఫిలిం ఫేమ్ సంజన చెల్లెలు నిక్కిగార్ల, సునీల్ జంటగా వాసు వర్మ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకు 'మలుపు' అనే టైటిల్ అనుకుంటునట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రవిరాజా పినిశెట్టి తనయుడు సత్య ప్రసాద్ పినిశెట్టి దర్శకత్వంలో రవిరాజా నిర్మిస్తున్న సినిమాకు టైటిల్ గా మలుపు ను కన్ఫర్మ్ చేసారు. టీజర్ రిలీజ్ అయ్యి త్వరలో సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరి సునీల్ నటించే ఈ సినిమాకు 'మలుపు' టైటిల్ ఎలా పెడతారు అనేది ఆసక్తికరంగా ఉన్న విషయం. ఇక సినిమా విషయానికి వస్తే కామెడి ఎంటర్ టైనర్ గా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. 'మర్యాద రామన్న' తరువాత హీరోగా ఆ రేంజ్ హిట్ లేని సునీల్ ఈ సినిమాతో అయినా సక్సెస్ అవుతాడేమో చూడాలి..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ