Advertisementt

టాలీవుడ్ కు మరో శ్రుతి దొరికింది..!

Fri 06th Feb 2015 12:54 AM
sruthi sodi,patas,aadi,anil sunkara,ak entertainments  టాలీవుడ్ కు మరో శ్రుతి దొరికింది..!
టాలీవుడ్ కు మరో శ్రుతి దొరికింది..!
Advertisement
Ads by CJ

'పటాస్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మరో బ్యూటీ శ్రుతి సోది. ఇప్పటికే మరో 'శ్రుతి' టాప్ హీరోయిన్ గా వెలుగుతోన్న సమయంలో తన తొలి చిత్రంతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న శ్రుతి సోదిపై ప్రస్తుతం పలువురు సినీ మేకర్స్ కళ్ళు పడ్డాయి. ఈ పంజాబీ పోరీ గతంలో పంజాబీలో రెండు చిత్రాలు చేసింది. హిట్స్ ఇచ్చిన చిత్రాలలోని హీరోయిన్ల వెంట పడే మన మేకర్స్ ఈ పంజాబీ భామపై ఎన్నో ఆసలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్ల కొరత ఈ హీరోయిన్ వల్ల కొంతైనా తగ్గుతుందని భావిస్తున్నారు. అనేక ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఆమె ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. తాజాగా వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో ఆది హీరోగా నిర్మితం కానున్న చిత్రంలో ఈ అమ్మదుకు ఛాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మాత అనిల్ సుంకర తన ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నాడు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ