చిరంజీవి సేవా కార్యక్రమాన్ని చేపట్టాలి..!

Mon 02nd Feb 2015 07:15 AM
Advertisement
chiranjeevi,chiranjeevi blood bank,eye bank,lipi  చిరంజీవి సేవా కార్యక్రమాన్ని చేపట్టాలి..!
చిరంజీవి సేవా కార్యక్రమాన్ని చేపట్టాలి..!
Advertisement

చిరంజీవికి సామాజిక సేవకునిగా గుర్తింపు గౌరవం తెచ్చింది ‘చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌’. ఆయన సేవలు చూసి నాటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ముచ్చటపడ్డారు. ‘పద్మ’ అవార్డులు చిరంజీవిని వరించడంలో ఈ సేవా కార్యక్రమాల పాత్రకూడా వుంది. చిరంజీవికి కులమత ప్రాంతాలకు అతీతంగా అభిమానులున్నారు. వారు సర్వకాల సర్వావస్థలందు చిరంజీవినే అంటిపెట్టుకుని వుంటారు. వారికి ఓ కార్యక్రమాన్ని ఇవ్వవలసిన అవసరం వుంది. ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రజలతో మమేకమయ్యే సేవా కార్యక్రమాన్ని చేపట్టాలి. అవయవదానాన్ని విస్తృతంగా ప్రజలలోకి తీసికెళ్ళాలి. అంధుల ‘లిపి’ బ్రెయిలీని అందరికీ పరిచయం చేయాలి. తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవి ఫ్యామ్లీ సగభాగం అన్నది నిర్వివాదాంశం. చిరంజీవి కదిలితే తెలుగు సినిమా పరిశ్రమ కదిలినట్లే!

తోటకూర రఘు

Advertisement
Advertisement

Loading..
Loading..
Loading..
advertisement