Advertisement

అఖిల్‌ సినిమా అప్‌డేట్స్‌..!

Mon 02nd Feb 2015 06:53 AM
akhil,sisindree,manam,v.v.vinayak,nithin  అఖిల్‌ సినిమా అప్‌డేట్స్‌..!
అఖిల్‌ సినిమా అప్‌డేట్స్‌..!
Advertisement

అక్కినేని నట వారసుడిగా అందరి దృష్టినీ ఆకర్షిస్తూ, హీరోగా తెరంగేట్రం చేయడానికి ముందే నెలల పసిబాలుడిగా ‘సిసింద్రీ’ చిత్రంతో, ఆ తర్వాత ‘మనం’లో గెస్ట్‌ అప్పిరియన్స్‌తో, ఆ తర్వాత రెండు వాణిజ్య ప్రకటనలతో అందరినీ ఆకట్టుకున్న అక్కినేని అఖిల్‌ హీరోగా వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో ఓ చిత్రం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి 9 నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని హీరో నితిన్‌తో పాటు అతని తండ్రి సుధాకర్‌రెడ్డి సొంతంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్‌, ఇతర వివరాలను ఫిబ్రవరి 9 నే యూనిట్‌ సభ్యులు వెల్లడిచేయనున్నారట. ఈ చిత్రంతో మొదటిసారి వి.వి. వినాయక్‌ ఓ సోషియోఫాంటసీ కథకు డైరెక్షన్‌ చేస్తుండటం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement