నిరాశ పరుస్తున్న యంగ్ హీరో..!

Sat 31st Jan 2015 02:13 AM
sandeep kishan,beeruva flop talk,patas,tiger movie  నిరాశ పరుస్తున్న యంగ్ హీరో..!
నిరాశ పరుస్తున్న యంగ్ హీరో..!
Advertisement
Ads by CJ

యంగ్ హీరో సందీప్ కిషన్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తర్వాత తనకు వచ్చిన క్రేజ్ ను ఆయన తన అవగాహనా రాహిత్యం, స్క్రిప్ట్ ల ఎంపికలో తప్పిదాల వల్ల పోగొట్టుకుంటున్నాడు. 'డి ఫర్ దోపిడీ, రారా... కృష్ణయ్య, జోరు' తాజాగా 'బీరువా' చిత్రాలతో ఈ హీరో బాగా నిరాశపరిచాడు. మిగతా చిత్రాలకు కనీసం  ఓపెనింగ్స్ అయినా వచ్చాయి. కానీ 'బీరువా' పరిస్థితి దారుణం. రెండు అగ్ర నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఇంత దారుణంగా పరాజయం పాలవుతుందని ఎవ్వరూ భావించలేదు. అయితే సినిమాలో సత్తా లేకపోవడం, మరో పక్క 'పటాస్' దెబ్బకు 'బీరువా' చిత్రం తట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సందీప్ కిషన్ ఆశలన్నీ 'టైగర్' చిత్రంపైనే ఉన్నాయి. మరి ఈ ఫ్లాప్ ల నుండి 'టైగర్' అయినా అతడిని బయటపడవేస్తుందో లేదో చూడాలి...!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ