Advertisement

‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’ సక్సెస్‌మీట్‌

Sat 31st Jan 2015 02:21 AM
ladies and gentlemen movie,madhura sridhar,nikhitha narayan,swathi dikshit  ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’ సక్సెస్‌మీట్‌
‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’ సక్సెస్‌మీట్‌
Advertisement

చైతన్యకృష్ణ, మహత్‌, అడవిశేష్‌, కమల్‌ కామరాజ్‌, స్వాతి దీక్షిత్‌, నిఖితా నారాయణ్‌ ప్రధాన పాత్రల్లో పి.బి.మంజునాథ్‌ను దర్శకుడుగా పరిచయం చేస్తూ మధుర శ్రీధర్‌రెడ్డి నిర్మాతగా, షిరిడీ సాయి కంబైన్స్‌ పతాకంపై ఎం.వి.కె.రెడ్డితో కలిసి నిర్మించిన చిత్రం ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా ఈరోజు రిలీజ్‌ అయింది. ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ని తెలియజేసేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నిర్మాత మధురశ్రీధర్‌, దర్శకుడు పి.బి.మంజునాథ్‌, సంగీత దర్శకుడు రఘు కుంచె, అడవి శేష్‌, స్వాతి దీక్షిత్‌, నిఖితా నారాయణ్‌, కథా రచయిత సంజీవ్‌రెడ్డి, మాటల రచయిత నివాస్‌, సినిమాటోగ్రాఫర్‌ జగన్‌, రాజ్‌ కందుకూరి తదితరులు పాల్గొన్నారు.

మధుర శ్రీధర్‌: ఈరోజు మార్నింగ్‌ షో థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి మా యూనిట్‌ అంతా చూసింది. సినిమాని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. వారి కళ్ళల్లో చాలా ఆనందంగా చూశాను. ఒక కొత్త కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటున్నందుకు చాలా ఆనందంగా వుంది. మంజునాథ్‌కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో ఎక్స్‌పీరియన్స్‌ వున్న డైరెక్టర్‌లా చేశాడు. ఇలాంటి సినిమాలు ఆడియన్స్‌లోకి వెళ్ళి మంచి సక్సెస్‌ అయితే ముందు ముందు మరిన్ని ఎక్స్‌పెరిమెంట్స్‌ చేసే అవకాశం వుంటుంది. కొత్త కాన్సెప్ట్‌తో చేసిన ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు నమ్మడానికి కొంత టైమ్‌ పడుతుంది. కొత్త తరహా సినిమాలు ఎప్పుడూ ఆదరించే ప్రేక్షకుల్లో మార్నింగ్‌ షో నుంచే మంచి రెస్పాన్స్‌ రావడం హ్యాపీగా వుంది. రెగ్యులర్‌ ఫార్మాట్‌ సినిమాలు కాకుండా సోషల్‌ ఎవేర్‌నెస్‌తో కూడిన కొత్త సినిమాలే తియ్యాలన్నది మా టీమ్‌ ఉద్దేశం. భవిష్యత్తులో కూడా ఇలాంటి సినిమాలే తీస్తాం. ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.

రఘు కుంచె: ప్రేక్షకుల మధ్య సినిమా చూస్తుంటే వారి నుంచి వస్తున్న రెస్పాన్స్‌ చూసి చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. నిజాయితీతో మా టీమ్‌ చేసిన ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఆదరణ రోజు రోజుకీ పెరిగి ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాను.

పి.బి.మంజునాథ్‌: ఈ సినిమాకి అందరూ బాగా ప్లస్‌ అయ్యారు. ముఖ్యంగా మ్యూజిక్‌, ఫోటోగ్రఫీ సినిమా మెయిన్‌ ప్లస్‌ అని చెప్పాలి. ప్రేక్షకుల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ కాన్సెప్ట్‌ కావడంవల్ల ప్రతి సీన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మధుర శ్రీధర్‌గారికి ధన్యవాదాలు.

రాజ్‌ కందుకూరి: ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్‌ చేశారు. మంజునాథ్‌ చాలా ఎక్స్‌లెంట్‌గా ఈ సినిమా తీశారు. రఘు మంచి పాటలు, మంచి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఈ సినిమా తప్పకుండా చాలా పెద్ద రేంజ్‌కి వెళ్తుంది. 

నిఖితా నారాయణ్‌: ఈ మూవీని సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌. థియేటర్‌లో రెస్పాన్స్‌ మామూలుగా లేదు. అన్ని చోట్ల నుంచి చాలా మంచి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

స్వాతి దీక్షిత్‌: ఇంత మంచి సినిమాలో నేను కూడా ఒక పార్ట్‌ అయినందుకు చాలా ఆనందంగా వుంది. సినిమా సక్సెస్‌ అవుతుందని మేం ముందే ఊహించాం. అయితే ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే ఇంకా చాలా హ్యాపీగా వుంది. మధుర శ్రీధర్‌గారు తీసే అన్ని సినిమాల్లో నాకూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను.

అడవి శేష్‌: ఈ సినిమా ఔట్‌పుట్‌ చూసి ఎంతో శాటిస్‌ఫై అయ్యాము. ఇప్పుడు ఆడియన్స్‌ రెస్పాన్స్‌ చూసి డబుల్‌ శాటిస్‌ఫై అవుతున్నాం. సినిమా ఎండిరగ్‌లో వచ్చే ట్విస్ట్‌ అందర్నీ థ్రిల్‌ చేస్తుంది. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన అందరికీ థాంక్స్‌.

 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement