ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన బిగ్ బి..!

ఇందిరా గాంధీ కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్వర్గీయ రాజీవ్ గాంధీ బతికి ఉన్నప్పుడు ఆయన ప్రోద్బలంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి రాజకీయాలకు దూరంగా జరిగిన ఆయన మరోసారి నేటి ప్రధాని మోడీకి సన్నిహితుడిగా పేరు తెచ్చుకుంటున్న సమయంలో ఆయన మరోసారి పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని, ఆయన బిజెపిలో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని అమితాబ్ ఖండించాడు. తాను మరలా రాజకీయాల్లోకి రానని, ప్రధాని మోడీ ప్రారంభించిన 'స్వచ్చభారత్' వంటి సామజిక కార్యక్రమాల్లో నా బాధ్యతగా పాలుపంచుకొంటున్నానని స్పష్టం చేశాడు. ఇదే సమయంలో మలయాల స్టార్ సురేష్ గోపీ బిజెపిలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.
indira gandhi
amithab bacchan
political entry
narendra modi
bjp party







































