శంకర్ పూర్వవైభవం మళ్ళీ రానుందా..!

Thu 22nd Jan 2015 05:18 AM
shankar i,robot,chiranjeevi,rajanikanth,robot2  శంకర్ పూర్వవైభవం మళ్ళీ రానుందా..!
శంకర్ పూర్వవైభవం మళ్ళీ రానుందా..!
Advertisement
Ads by CJ

'ఐ' సినిమా కలెక్షన్ల సంగతి పక్కన పెడితే ఈ చిత్రం డైరెక్టర్ శంకర్ కు చెడ్డపేరునే తెచ్చిపెట్టింది. సినిమాకు వచ్చిన ప్రశంసలు అన్నీ హీరో విక్రమ్ కు దక్కుతున్నాయి. దీంతో  శంకర్ తన తదుపరి చిత్రాలపై మరింత శ్రద్ధ పెడుతున్నాడని సమాచారం. తన తదుపరి చిత్రం కోసం ఆయన రెండు స్టోరీలు సిద్దం చేసుకున్నట్లు సమాచారం. అందులో ఒకటి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం అని తెలుస్తోంది. ఇక 'రోబో2'ను అనేక మందితో ప్లాన్ చేసిన శంకర్ చివరకు రజని చెంతకే చేరాడని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం శంకర్ తో పాటు రజనీకి కూడా బ్లాక్ బస్టర్ అవసరం. అందుకే ముందు అంత కష్టపడలేను అనుకొని 'రోబో 2'ను పక్కన పెట్టిన రజనీ ప్రస్తుతం ఆ చిత్రాన్ని చేయడానికి తన సంసిద్దతను చూపించాడని చెప్పుకొంటున్నారు. మరి ఈ రెండు చిత్రాల ద్వారా అయినా శంకర్ మరలా తన పూర్వవైభవాన్ని అందుకుంటాడో లేదో వేచిచూడాలి...!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ