టాలీవుడ్ లో స్టార్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న రచయిత వక్కంతం వంశీ అంటే ఎన్టీఆర్ కు భలే నమ్మకం... అయితే ఎప్పుడో ఎన్టీఆర్ వక్కంతం వంశీకి మంచి కధ రెడీ చేసుకో.. నిన్ను డైరెక్టర్ ను చేస్తాను అని మాట ఇచ్చాడు. ఇదే విషయాన్ని వంశీ బహిరంగంగా ఇంటర్వ్యూ లలో కూడా చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం ఫ్లాప్ ల్లో ఉన్నందున అంతటి రిస్క్ చేయడం ఇష్టం లేక ఆ మాటను ఎన్టీఆర్ పక్కన పెట్టాడు. అయితే ఆయన స్టోరీతోనే ఇప్పుడు పూరీజగన్నాధ్ 'టెంపర్' చిత్రం చేస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి స్టోరీ అందించినందుకు పారితోషికంగా ఎన్టీఆర్ బలవంతంగా నిర్మాత బండ్ల గణేష్ ను ఒప్పించి కోటిరూపాయలు ఇప్పించాడని ఫిల్మ్ నగర్ టాక్. ఒక స్టోరీకీ కోటి రూపాయలు అందుకోవడం టాలీవుడ్ లో సామాన్యమైన విషయం ఏమీ కాదని, అయినా ఎన్టీఆర్ పట్టుపట్టడంతో బండ్ల గణేష్ అంత పెద్దమొతాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడట. కాగా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కోసం అనేక చానెల్స్ పోటీపడ్డాయి. చివరకు 7 కోట్ల 70 లక్షలకు ఓ చానెల్ రైట్స్ సొంతం చేసుకుందని సమాచారం. కాగా 'టెంపర్' చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా బ్యా గ్రౌండ్ స్కోర్ ను మాత్రం మణిశర్మ అందిస్తున్నాడు. త్వరలో ఎన్టీఆర్-సుకుమార్ ల సినిమా కూడా ప్రారంభం కానుంది. ఈ చిత్రం ఫాదర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుంది. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఖరారైనట్లు సమాచారం.