Advertisementt

హిట్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు..!

Tue 13th Jan 2015 08:11 AM
hanuman junction,ravi babu,manasara,sreedivya,bus stop,maruthi,nani,talent,tamil market,hit,career  హిట్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు..!
హిట్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు..!
Advertisement
Ads by CJ

చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి  'హనుమాన్ జంక్షన్' చిత్రం ద్వారా  తెలుగు ప్రేక్షకులకు  పరిచయమై, రవిబాబు దర్శకత్వం లో వచ్చిన 'మనసారా' చిత్రం తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది నటి శ్రీదివ్య. తరువాత మారుతి దర్శకత్వం లో వచ్చిన 'బస్ స్టాప్' చిత్రం శ్రీదివ్య కు మరింత గుర్తింపు తెచ్చింది. చిత్రం తరువాత నటన పరంగా మంచి టాలెంట్ వున్న అమ్మడు పై, మారుతి కి మంచి నమ్మకాలు ఏర్పడ్డాయి. దాంతో త్వరలో నాని హీరోగా మారుతి రూపొందించనున్నచిత్రం కోసం ఎంతో మంది హీరోయిన్లను పరిశీలించిన మారుతికి.. ఎవ్వరూ కరెక్ట్ గా అనిపించక పోవడం తో.. చివరికి శ్రీదివ్య కే అవకాశం ఇచ్చాడని తెలుస్తుందితమిళంలో కూడా శ్రీదివ్య కు మంచి గుర్తింపు వుండటం, మరో పక్క నానికి వున్న తమిళ మార్కెట్ ను కూడా ఉపయోగించుకోవాలని భావిస్తున్న మారుతి కి ఇద్దరి జోడితో సినిమా చేస్తే సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని భావించి, ఆమెకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. చిత్రం ద్వారా శ్రీదివ్య కు, నానికి హిట్ ఇవ్వడమే కాదు, దర్శకునిగా ఇబ్బందుల్లో వున్న తన కెరీర్ ను కూడా గాడిలో పెట్టుకోవాలని మారుతి భావిస్తున్నాడు. దీంతో చిత్రం అందరికీ కీలకంగా మారనుంది

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ