సంజయ్ దత్ జీవిత చరిత్ర త్వరలో..!

Sun 11th Jan 2015 06:57 AM
sanjay dutt,rajkumar hirani,pk movie,biopic movie,amitabh bachchan  సంజయ్ దత్ జీవిత చరిత్ర త్వరలో..!
సంజయ్ దత్ జీవిత చరిత్ర త్వరలో..!
Sponsored links

'పీకే' వంటి సంచలన చిత్రం తర్వాత ఈ చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి ఓ బయోపిక్ చిత్రాన్ని తీయడానికి రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ టాక్. ప్రముఖ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవిత కధ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్రను రణబీర్ కపూర్ పోషించనున్నాడు, అతని తండ్రి స్వర్గీయ సునీత్ దత్ పాత్రను బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్  పోషించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ లో ప్రస్తుతం రాజ్ కుమార్ హిరాణి నిమగ్నమయ్యాడని, జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు అధిగమించి ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న సంజయ్ దత్ జీవితచరిత్రను తెరకెక్కిస్తున్నారనే వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే ఈ చిత్రంలో సంజయ్ దత్ ను నెగటివ్ గా చూపిస్తారా? లేక పాజిటివ్ గా చూపిస్తారా? అనే అంశంలో అంతటా ఆసక్తి నెలకొనివుంది. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019