Advertisement

మొత్తానికి ఆ సినిమాకు సీక్వెల్ ఉంద‌న్న మాట‌!

Update On Brahmastra 2

 


బాలీవుడ్ స్టార్  రణ్‌బీర్ కపూర్ వరుస భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక `రామాయణం` చిత్రం షూటింగ్ పూర్తికాగానే ర‌ణ‌బీర్  డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `బ్రహ్మాస్త్ర 2` షూటింగ్‌లో అడుగుపెట్టనున్నారు. 2027 ఏప్రిల్ నుండి ఈ సీక్వెల్ పట్టాలెక్కనుందనే వార్త  బాలీవుడ్ వర్గాల్లో  చర్చనీ యాంశమవుతోంది. ఈ చిత్రంలో రణ్‌బీర్ సరసన మరోసారి ఆయన సతీమణి ఆలియా భట్ సందడి చేయనున్నారు.

మొదటి భాగం అందించిన భారీ విజయంతో రెండో భాగంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాను మరింత గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చిత్రంలో అత్యంత కీలకమైన దేవ్ ..ఇతర ముఖ్య పాత్రల కోసం గ్లామర్ తారలతో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా దీపికా పదుకొనే  సీక్వెల్‌లో పవర్‌ఫుల్ పాత్రలో నటించే అవకాశం ఉందని  ట్రేడ్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

రామాయణంతో మైథలాజికల్ జోనర్‌లో అదరగొట్టడానికి సిద్ధమవుతున్న రణ్‌బీర్ కపూర్, ఆ వెంటనే `బ్రహ్మాస్త్ర 2`తో మరోసారి విజువల్ వండర్ సృష్టించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టాలీవుడ్ - బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ కాంబినేషన్లు సృష్టించబోయే సంచలనాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వాస్త‌వానికి `బ్ర‌హ్మాస్త్ర 2` ఉంటుందా? ఉండ‌దా? అని చాలా మందిలో చాలా సందేహాలుండేవి. మేక‌ర్స్ మాత్రం ఎప్ప టిక‌ప్పుడు ఉంటుంద‌ని క్లారిటీ ఇచ్చినా ప్రేక్ష‌కులు న‌మ్మేవారు కాదు. తాజాగా  వ‌చ్చే ఏడాదిలో షూటింగ్ కి రెడీ అవ్వ‌డంతో ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌డం ఖాయ‌మ‌ని తేలిపోయింది.

Ranbir To Join Brahmastra 2