ఓపెనింగ్స్ లో రవితేజ ఇరుముడి ర్యాంపేజ్
Mass Raja sensation in Irumudi bookings
వరస వైఫల్యాలతో ఇబ్బందిపడుతున్న మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ చిత్రం ఇరుముడి రేపు శుక్రవారం ఆగస్టు 21 న విడుదల కాబోతుంది. మొదటి నుంచి కుటుంబ కథా చిత్రంగా ఇరుముడిపై అంచనాలు పెంచేలా దర్శకుడు శివ నిర్వాణ ప్లాన్ చేసి ప్రమోషన్స్ చేస్తున్నారు.
రవితేజ కూడా ఇరుముడి పై అంచనాలు పెంచేలా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇరుముడి విడుదలకు ముందు యాక్టీవ్ గా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అందుకే బుక్ మై షో లో ఇరుముడి ర్యాంపేజ్ కనిపిస్తుంది. నిన్న నైజాం లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగానే బుక్ మై షో లో హాట్ కేకుల్లా టికెట్లు తెగుతున్నాయి.
కేవలం నైజాం లోనే కాదు ఓవర్సీస్ లోను ఇరుముడి ర్యాంపేజ్ కనిపిస్తుంది. రవితేజ ఇరుముడి తో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తేవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇరుముడి తో మళ్లీ రవితేజ రూ.100 కోట్ల క్లబ్బులోకి చేరి బౌన్స్ బ్యాక్ అవుతారనేలా ఇరుముడి బుకింగ్స్ కనిపిస్తున్నాయి. చూద్దాం మరికొన్ని గంటల్లో ఇరుముడి జాతకం ఏమిటి అనేది తెలిసిపోతుంది.







































