ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి పొంచి ఉన్న గండం

Vishwanath and Sons


సూర్య హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. వీక్ డేస్ లో మార్నింగ్ షోస్ ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్నా నైట్ షోస్ ఫుల్ అవుతున్నాయి. సూర్య నటన, ఆయన లుక్స్, మమిత బైజు, రాధికా శరత్ కుమార్ ల కాంబో సీన్స్ ని ఆడియన్స్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఈమధ్య కాలంలో ఎన్ని సినిమాలు హిట్ అయినా విశ్వనాథ్ అండ్ సన్స్ లాంటి ఫ్యామిలీ సినిమా చూసి.. ఎన్నాళ్ళయింది, ఇలాంటి చిత్రాన్ని థియేటర్ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని కామెంట్స్ చేస్తున్నారు. పక్కా కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పుడు మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ నుంచి ప్రమాదం పొంది ఉంది

అది రేపు విడుదల కాబోతున్న రవితేజ ఇరుముడి. ఇరుముడి ప్రమోషనల్ కంటెంట్, అలాగే టీమ్ ప్రమోషన్స్ ఈ చిత్రంపై హైప్ క్రియేట్ చేసాయి. ఇరుముడి కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో రేపటి నుంచి విశ్వనాథ్ అండ్ సన్స్ కి ప్రాబ్లెమ్ కావడం ఖాయం. రవితేజ ఇరుముడికి హిట్ టాక్ వస్తే విశ్వనాథ్ అండ్ సన్స్ ఆశలు గల్లంతే. 

Ravi Teja Irumudi