అవ‌తార్` రికార్డును కొట్టేసిన `ది ఒడిస్సీ`

The Odyssey Breaks Avatar’s Record

 

క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన హాలీవుడ్ విజువల్ వండర్ `ది ఒడిస్సీ` గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను తిరగరాసింది. ఇప్పటివరకు 1.1 బిలియన్ డాలర్ల మార్కును అందుకుని.. నోలన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన `ది డార్క్ నైట్ రైజెస్` రికార్డును దాటేసింది. చైనా, జపాన్ లాంటి భారీ మార్కెట్లలో ఇంకా విడుదల కాకముందే ఈ ఘనత సాధించడం విశేషం. అంతేకాకుండా ఐమాక్స్ (IMAX) చరిత్రలోనే ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా జేమ్స్ కేమరూన్ `అవతార్` ($271 మిలియన్లు) రికార్డును అధిగమించి, $289 మిలియన్ల వసూళ్లతో `ది ఒడిస్సీ` అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

పూర్తిస్థాయిలో ఐమాక్స్ కెమెరాలతోనే చిత్రీకరించిన తొలి సినిమాగా రికార్డు సృష్టించిన ఈ దృశ్యకావ్యానికి ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం అమెరికాలోనే ఐమాక్స్ వెర్షన్ $147.3 మిలియన్లు రాబట్టగా.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మరో $141.8 మిలియన్లు వసూలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐమాక్స్ 70ఎంఎం స్క్రీన్లలో సెప్టెంబర్ వరకు టిక్కెట్లు అన్నీ ముందస్తుగానే అమ్ముడైపోవడం నోలన్ సినిమాకున్న విపరీతమైన క్రేజ్‌ను చాటిచెబుతోంది. ఈ శుక్రవారం చైనాలోని 800 ఐమాక్స్ స్క్రీన్లలో ఇది విడుదల కాబోతుండటంతో అక్కడా వసూళ్ల సునామీ ఖాయ‌మ‌ని, మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం గ్యారెంటీ అని విశ్లేషిస్తున్నారు.

The Odyssey Takes Down an Avatar Record