కిరణ్ అబ్బవరం ఇంద్రపుత్ర
Kiran Abbavaram-Indraputraక, కె ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. క చిత్రంతో థ్రిల్లర్, కె ర్యాంప్ తో మాస్ ఎంటర్ టైనర్, చెన్నైలవ్ స్టోరీ తో ఎమోషనల్ లవ్ స్టోరీ చేసిన కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన జానర్స్ ను ఎంచుకుంటూ హీరోగా తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు.
ఈ క్రమంలో జాయ్ ఫిలింస్ లో ఓ సినిమా, కెఎ 13 అనే మరో సినిమాతో పాటు సుకుమార్ రైటింగ్స్ లో కెఎ 14 సినిమా చేస్తున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు కెఎ15 గా భారీ మైథాలజీ మూవీని ప్రకటించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా నిర్మాణంలో డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ పుప్పాల కాంబినేషన్ లో కిరణ్ అబ్బవరం హీరోగా ఎపిక్ మైథాలజీ మూవీ ఇంద్రపుత్ర ఫస్ట్ ఛాప్టర్ ఈ రోజు అనౌన్స్ చేశారు. మన పురాణ ఇతిహాసాల్లోని ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు కొత్త దర్శకుడు శ్రీకాంత్ పుప్పాల.
మైథాలజీ, యాక్షన్, ఫాంటసీ, ఎమోషన్ వంటి అంశాలతో గ్రాండ్ స్కేల్ లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఇంద్రపుత్ర ఫస్ట్ ఛాప్టర్ మూవీ నిర్మాణం కానుంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ అందించనుంది. హీరో కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ లో సరికొత్త అవతార్ లో కనిపించనున్నారు. భాషలకు అతీతంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా లార్జ్ స్కేల్ పాన్ ఇండియా చిత్రంగా ఇంద్రపుత్ర ఫస్ట్ ఛాప్టర్ తెరపైకి రానుంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. వచ్చే ఏడాది ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ కానుంది. ఈ చిత్రానికి కీర్తన్ స్టోరీని అందించి, కుస్సుమ్ అరోరాతో కలిసి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.






































