వీధి కుక్క కోసం బోరున విల‌పించిన న‌టి!

Manjari Fadnis In TearsManjari Fadnis In Tears

 

బాలీవుడ్‌లో క్లాసిక్ హిట్‌గా నిలిచిన `జానే తూ యా జానే నా` చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి మంజరి ఫడ్నిస్. ప్రస్తుతం ఈ బ్యూటీ  తీవ్రమైన వ్యక్తిగత విషాదంలో మునిగిపోయారు. ఆమె ఎంతగానో ప్రేమించిన ఓ వీధి కుక్క దారుణంగా హత్యకు గురికావడంతో తీవ్ర‌ మనస్తాపానికి గురయ్యారు. ఈ ఘటన ఆమెను మానసికంగా తీవ్రంగా కలిచివేసింది. మూగజీవాలపై జరుగుతున్న ఇలాంటి  అమానవీయ దాడుల పట్ల  సోషల్ మీడియా వేదికగా కన్నీరు పెట్టుకున్నారు.

నివాస ప్రాంతంలో ఉంటూ అందరితో కలిసిపోయే ఓ  వీధి కుక్కను ఎవరో దుండగులు ఉద్దేశపూర్వకంగానే చంపేశారని మంజరి ఆరోపించారు. మానవత్వానికే మచ్చ తెచ్చేలా జరిగిన ఈ ఘాతుకాన్ని ఆమె అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. మూగజీవాల పట్ల కొందరు మనుషులు ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తారంటూ ఎంతో భావోద్వేగంతో ప్రశ్నించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేస్తున్నారు.

తాను ఎంతగానో ఇష్టపడే ఆ శునకం ఇక లేదనే నిజాన్ని నటి తట్టుకోలేకపోతున్నారు. సామాజిక మాధ్యమాలలో ఆమె పంచుకున్న ఓ వీడియోలో మంజరి ఫడ్నిస్ తన దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కివెక్కి ఏడవడం చూసి అభిమానులు .. జంతు ప్రేమికులు సైతం చలించిపోతున్నారు. కేవలం ప్రేమను మాత్రమే పంచే అమాయక ప్రాణాన్ని అంత దారుణంగా ఎలా హతమారుస్తారని.. సమాజంలో మనుషుల ప్రవర్తన ఇంతలా దిగజారిపోవడం ఆందోళనకరమని  ఆవేదన చెందారు.
 

Manjari Fadnis breaks down for society dog