పెద్ది వీకెండ్ సినిమానా?
Peddi movie public talk
రామ్ చరణ్ లేటెస్ట్ చిత్రం పెద్ది ఈ గురువారం పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుధవారం సాయంత్రం నుంచే పెద్ది ప్రీమియర్స్ తో మెగా ఫ్యాన్స్ హడావిడి మామూలుగాలేదు. ప్రీమియర్స్ టాక్, ఫస్ట్ డే టాక్ పెద్ది కి ఫేవర్ గా అనిపించినా, మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ తీసుకొచ్చినా సాధారణ ప్రేక్షకుడు పెద్ది ని చూసి పెదవి విరుస్తున్నాడు.
పెద్ది చిత్రం లో రామ్ చరణ్ తప్ప మరేది కనిపించలేదు. BGM కానీ, సినిమాటోగ్రఫీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, బుచ్చి బాబు దర్శకత్వం కానీ, హీరో-హీరోయిన్ కెమిస్ట్రీ కానీ ఏది ఆకట్టుకోలేదు. రామ్ చరణ్ అసలు పెద్ది కథను ఎలా ఓకే చేసాడు, స్పోర్ట్స్ డ్రామా అంటూ పాన్ ఇండియా మెరుపులు చూపించారు.. తప్ప అందులో ఏమి లేదు.
పెద్ది వరెస్ట్ సినిమా, క్రిటిక్స్ ని మ్యానేజ్ చేసి రేటింగ్స్ తెచ్చుకున్నారు. రామ్ చరణ్ మ్యానియా, మెగా ఫ్యాన్స్ హడావిడితో ఎంతోకొంత సేవ్ అవుతుంది. ఈ సమ్మర్ సెలవలు ఇంకా మిగలడం పెద్దికి అడ్వాంటేజ్. లేదంటే పెద్ది వీకెండ్ మాత్రమే తన ప్రతాపం చూపిస్తుంది. పెద్ది కి సోమవారం కఠిన పరీక్ష స్టార్ట్ అవుతుంది.
సోమవారం టెస్ట్ లో పెద్ది పాస్ అవడం ఛాలెంజింగ్ విషయం. రామ్ చరణ్ స్టామినా వీకెండ్ వరకే పని చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
















































