ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> producers To Think Before greenlighting Big Budget films

పెద్ద సినిమాలు జాగ్రత్త పడితే మంచిది

producers To Think Before greenlighting Big Budget films

 

నిజమే టాలీవుడ్ నిర్మాతలు పెద్ద సినిమాలంటూ భారీగా బడ్జెట్ పెట్టి సినిమా తెరకెక్కించేముందు ఒక్కసారి ఆలోచిస్తే ఇకనైనా బెటర్ ఏమో. భారీ బడ్జెట్ సినిమాలు చేసాము, మాకు టికెట్ రేట్లు పెంచండి, ప్రీమియర్స్ షోస్ కి అనుమతి ఇవ్వండి అంటూ నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను అడుగుతున్నారు.

ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు టికెట్ రేట్లు పెంచలేదు, ప్రీమియర్స్ షోస్ కి అనుమతులు ఇవ్వలేదు. ఆతర్వాత చంద్రబాబు వచ్చారు.. ఉప ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కి వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇక తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వం టాలీవుడ్ కి అండగా నిలబడేది.

కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక సినిమా వాళ్ళతో పాజిటివ్ గా ఉంటున్నారు. కానీ తెలంగాణ హై కోర్టులో వేస్తున్న పిటిషన్స్ కారణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్మాతలకు అండగా నిలబడలేకపోతున్నారు. రాజసాబ్ ఇలా పెద్ద సినిమాలకు ప్రీమియర్స్ కి, టికెట్ రేట్ల హైక్ లేక నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు.

ఇప్పుడు పెద్ది కి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్స్, టికెట్ రేట్ల హైక్ కి ఒప్పుకుంటుందో, లేదో అనే సస్పెన్స్ చూసాక అయినా.. నిర్మాతలు భారీగా పెట్టుబడులు పెట్టేసి దానిని రికవరీ చేసుకోవడానికి ప్రభుత్వాల వెంటపడి అడుక్కున్నా పని జరగడం లేదు. ఇప్పటికైనా నిర్మాతలు ఆలోచన చేస్తే వారికే మంచిది. 
 

producers To Reverse-Engineer the Budget