పెద్ది తర్వాత చరణ్ లైనప్ అదేనా?

Ram Charan Lineup After PeddiRam Charan Lineup After Peddi


పెద్ది పాన్ ఇండియా మూవీ తో జూన్ 4 న పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రామ్ చరణ్ అన్ని రకాలుగా సిద్డమాయ్యారు. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రమోషన్స్ ముగించుకుని రామ్ చరణ్ హైదెరాబాద్ లో అడుగుపెట్టారు. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజులు భారీ ఈవెంట్స్ ప్లాన్ చేసారు మేకర్స్.

పెద్ది తర్వాత రామ్ చరణ్ ఇమ్మిడియట్ గా సుకుమార్ తో చేయబోతే RC 17 సెట్ లోకి వెళ్ళిపోతారు రామ్ చరణ్. ప్రస్తుతం చరణ్ కొన్ని ఇంజ్యురీస్ తో ఇబ్బందిపడుతున్నారు. వాటి నుంచి కోలుకోగానే RC 17 సెట్ లోకి వెళ్లబోయే రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టుకున్నారనే టాక్ నడుస్తుంది.

అది ఎన్టీఆర్ తో డ్రాగన్ తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ రామ్ చరణ్-సుకుమార్ ప్రాజెక్ట్ తర్వాత చరణ్ తో మూవీ చెయ్యబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ రామ్ చరణ్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఓకే అయినట్లుగా తెలుస్తుంది. దానితో పాటుగా చరణ్ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ తో ఓ పిరియాడికల్ డ్రామా కి ఓకే చెప్పినట్లుగా టాక్.

పెద్ది తర్వాత రామ్ చరణ్ సుకుమార్, ప్రశాంత్ నీల్, సంజయ్ లీల భన్సాలీ అంటూ వరస లైనప్ పెట్టుకున్నట్లుగా ఫిలిం సర్కిల్స్ టాక్. 

Ram Charan Lineup