నితీష్ తివారీ ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణం` భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలవడమే కాకుండా నటీనటుల పారితోషికాల విషయంలోనూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్ర పోషిస్తున్న రణబీర్ కపూర్ రెండు భాగాలకు కలిపి ఏకంగా రూ. 150 కోట్లు (ఒక్కో భాగానికి రూ. 75 కోట్లు) అందుకుంటున్నట్లు సమాచారం. తన గత చిత్రాలైన `బ్రహ్మాస్త్ర`, `యానిమల్`లతో పోలిస్తే రణబీర్ తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేయడం విశేషం.
అదేవిధంగా రావణుడిగా కనిపిస్తున్న కన్నడ స్టార్ యష్ ఒక్కో భాగానికి రూ. 50 కోట్లు చొప్పున మొత్తం రూ. 100 కోట్లు తీసుకుంటున్నారు. KGF సిరీస్ తర్వాత యష్‌కు ఉన్న పాన్-ఇండియా క్రేజ్ దృష్ట్యా ఈ స్థాయి పారితోషికం అతడి స్టార్డమ్కు అద్దం పడుతోంది.
ఇక సీతమ్మ పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి కూడా తన పారితోషికాన్ని గణనీయంగా పెంచారని తెలిసింది. దక్షిణాది సినిమాల్లో సాధారణంగా రూ. 3 కోట్ల వరకు అందుకుంటున్న ఈ భామ పౌరాణిక గాథ కోసం రెండు భాగాలకు కలిపి రూ. 12 కోట్లు (ఒక్కో భాగానికి రూ. 6 కోట్లు) అందుకుంటున్నారు. ఇది తన కెరీర్లోనే అత్యధిక పారితోషికం కావడం గమనార్హం. హీరోలతో పోలిస్తే ఈ మొత్తం తక్కువగా అనిపించినా.. కేవలం నటనకు ఉన్న ప్రాధాన్యతను బట్టి సాయి పల్లవికి ఈ స్థాయి గౌరవం దక్కిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తం రూ. 4000 కోట్ల బడ్జెట్ ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో కేవలం ప్రధాన తారల కోసమే నిర్మాతలు వందల కోట్లు వెచ్చిస్తుండటం ఈ సినిమా స్థాయిని తెలియజేస్తోంది.





అంత ఈజీ కాదు విజయ్..

Loading..