Advertisementt

యుద్దం ధురంధ‌ర్ 2 ని ఆప‌గ‌ల‌దా

Thu 05th Mar 2026 08:52 PM
dhurandhar 2  యుద్దం ధురంధ‌ర్ 2 ని ఆప‌గ‌ల‌దా
Can War Stop Dhurandhar 2 యుద్దం ధురంధ‌ర్ 2 ని ఆప‌గ‌ల‌దా
Advertisement
Ads by CJ

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వంటి మ‌ధ్య ప్రాచ్య‌  దేశాల యుద్దం కార‌ణంగానూ సినిమాలు వాయిదా ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పాన్ ఇండియాలో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవ్వాల్సిన క‌న్న‌డ చిత్రం `టాక్సిక్` వాయిదా ప‌డింది. దీంతో అదే రోజు రిలీజ్ అవుతున్న బాలీవుడ్ చిత్రం `ధురంధ‌ర్ 2` కి లైన్ క్లియ‌ర్ అయింది. మ‌రి యుద్ద ప్ర‌భావం `ధురంధ‌ర్ 2` పై ఉంటుందా? ఉండ‌దా? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

 

మార్చి 19న `దురంధ‌ర్ 2 `రిలీజ్ కు క‌ట్టుబ‌డిన‌ప్ప‌టికీ రెండు ర‌కాల పరిస్థితులు క‌నిపిస్తున్నాయి. యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలు , యూరప్ మార్కెట్లలో ఉద్రిక్తతలు ఉన్నాయి. `ధురందర్ 2` వంటి భారీ బడ్జెట్ సినిమాకు కనీసం 50-80 కోట్ల వసూళ్లు విదేశీ మార్కెట్ నుండి రావాలి. థియేటర్లు మూతపడినా లేదా ప్రేక్షకులు రాకపోయినా నిర్మాతలకు భారీ నష్టం తప్పదు. ఈ సినిమా భారత్-పాక్ సరిహద్దు , గూఢచారి  నేపథ్యంలో సాగుతుంది.

 

నిజ జీవితంలో యుద్ధం జరుగుతున్నప్పుడు, ఇటువంటి కథలను ప్రదర్శించడం సెన్సార్ పరంగా లేదా దౌత్యపరంగా ఇబ్బందులకు దారితీయవచ్చు. వాయిదా పడకపోవడానికి గల కారణాలు చూస్తే?  ఈసినిమాకు పోటీ లేకపోవడం. ఏ సినిమాకైనా సోలో రిలీజ్ అయితే మంచి వ‌సూళ్ల‌కు అవ‌కాశం ఉంటుంది. యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు సహజంగానే ప్రజల్లో దేశభక్తి పెరుగుతుంది.

 

`ధురందర్ 2` దేశ రక్షణ నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి, ఆ ఎమోషన్ సినిమాకు ప్లస్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ , శాటిలైట్ రైట్స్ ద్వారా ఇప్పటికే భారీగా రికవరీ జరిగింది. కాబట్టి థియేటర్ వసూళ్లపై నిర్మాతలు కొంత రిస్క్ తీసుకోవడానికి అవ‌కాశం ఉంటుంది.

Can War Stop Dhurandhar 2:

WAR or Dhurandhar 2 who will win

Tags:   DHURANDHAR 2
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ