Advertisementt

ఇద్ద‌రి మ‌ధ్య న‌లిగిపోతున్న గురూజీ!

Thu 05th Mar 2026 05:46 PM
trivikram  ఇద్ద‌రి మ‌ధ్య న‌లిగిపోతున్న గురూజీ!
Trivikram in bigg Dilemma ఇద్ద‌రి మ‌ధ్య న‌లిగిపోతున్న గురూజీ!
Advertisement
Ads by CJ

గురూజీ త్రివిక్ర‌మ్ ఓ మైథ‌లాజిక‌ల్  స్క్రిప్ట్ తో పాన్ ఇండియాలో లాంచ్ అవ్వాల‌ని డిసైడ్ అయిన సంగ‌తి తెలిసిందే. అందులో హీరోగా తొలుత ఐకాన్ స్టార్ అల్లు  న‌టించాల్సి  ఉండ‌గా చివ‌రి నిమిషంలో ప్రాజెక్ట్  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌ద్ద‌కు చేరుకుంది. ఈయ‌న ఒకే చేసేసాడు. పాత్ర‌కు సంబంధించి తార‌క్ ప్రిప‌రేష‌న్ కూడా మొద‌లు పెట్టాడు. కానీ కొన్ని నెల‌ల‌కే తార‌క్ కూడా నో చెప్పిన‌ట్లు వార్త‌లొచ్చాయి. అటుపై మ‌ళ్లీ అదే క‌థ బ‌న్నీ వ‌ద్ద‌కు చేరిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

 

ఈసారి బ‌న్నీ ఒకే చేసిన‌ట్లు మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు వెడెక్కించాయి. అటుపై మ‌రికొన్ని రోజుల‌కు మ‌ళ్లీ తార‌క్ న‌టిస్తున్నాడ‌నే ప్ర‌చారం మొద‌లైంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ అస‌లీ క‌థ‌లో ఎవ‌రు న‌టిస్తున్నారు? అన్న‌ది అధికారికంగా మాత్రం క్లారిటీ లేదు. ఎంత‌సేపు ఆ క‌థ వీరిద్ద‌రి మ‌ధ్యే తిరుగుతుంది త‌ప్ప ఇందులోకి మ‌రో హీరో రాలేదు. న‌టిస్తే బ‌న్నీ న‌టించాలి లేదా  తార‌క్ ఆ ఛాన్స్ తీసుకోవాలిన అన్న వాద‌న త‌ప్ప మ‌రో కొత్త హీరో పేరు తెర‌పైకి రావ‌డం లేదు.

 

అయితే వీరిద్ద‌రి మ‌ధ్య‌లో గురూజీ నలిగిపోతున్నాడు? అన్న‌ది కాద‌న‌లేని నిజం.  ఇలాంటి కన్ప్యూజ‌న్  తెర‌పైకి  వ‌చ్చిన‌ప్పుడు ఎవ‌రికైనా  డైల‌మా త‌ప్ప‌దు. బ‌లంగా ఓ  హీరో స్టాండ్ తీసుకునే వ‌ర‌కూ గానీ డైరెక్ట‌ర్ కూడా క్లారిటీ ఇవ్వ‌లేదు. తార‌క్-బ‌న్నీ-త్రివిక్ర‌మ్ మ‌ధ్య స‌న్నివేశం అలాగే ఉందిప్పుడు. ప్ర‌స్తుతం గురూజీ విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా `ఆద‌ర్శ‌కుటుంబం హౌస్ నెంబ‌ర్ 47` టైటిల్ తో ఓ సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిదే. ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపు తార‌క్-బ‌న్నీల‌లో ఎవ‌రు న‌టిస్తారు? అన్న‌ది క్లారిటీకి రావాలి.

Trivikram in bigg Dilemma:

Trivikram in bigg Dilemma On His Next Hero

Tags:   TRIVIKRAM
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ