ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లైనప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందన్నది చెప్పాల్సిన పనిలేదు. అట్లీ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. అటుపై త్రివిక్రమ్ తో ఓమైథలాజికల్ సినిమా చేయనున్నాడు. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఆదిధ్య ధర్ ని లైన్ లో పెట్టాడు. సందీప్ రెడ్డి వంగాతోనూ సీరియస్ గా చర్చలు జరుపుతున్నాడు. ఆ కాంబినేషన్స్ దాదాపు ఖాయమైనవే. అలాగే `మిన్నల్ మురళి` ఫేమ్ మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్
తోనూ ఓ సినిమా చేస్తాడనే ప్రచారం జరుగోతంది.
తాజాగా ఇది ప్రచారం కాదు నిజమేనని తెలుస్తోంది. సోదరుడు అల్లు శిరీష్ వివాహ కార్యక్రమంలో భాగంగా వేడుకకు బాసిల్ కూడా అటెండ్ అయ్యాడు. అక్కడ బన్నీబాసిల్ ను ప్రత్యేకంగా ట్రీట్ చేసాడు. దగ్గరుండి సారద స్వాగతం పలికి సోదరుడిని పరిచయం చేసాడు. అనంతరం బన్నీ-బాసిల్ ప్రయివేట్ గానూ మాట్లాడుకున్నారు. ఇదంతా చూస్తుంటే వీరిద్దరి కాంబినేషన్ సినిమా కన్పమ్ అనడానిక ఇంతకన్నా గొప్ప ఆధారం ఏముంటుంది? అనొచ్చు.
ఓ సూపర్ హీరో కాన్సెప్ట్ స్టోరీని వినిపించినట్లు నెట్టింట ఇప్పటికే లీకైంది. బన్నీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ కాన్సెప్ట్ ని ప్లాన్ చేసినట్లు తాజాగా మళ్లీ చర్చ మొదలైంది. అల్లు అర్జున్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో అంతకు మించిన స్థాయిలో ఒక పాన్-ఇండియా సూపర్ హీరో సినిమా ప్లాన్ ఇంట్రెస్టింగ్. భారతీయ పురాణాలు లేదా జానపద అంశాలను జోడించిన ఒక మోడ్రన్ సూపర్ హీరో కథగా టాక్ వినిపిస్తోంది. బన్నీ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా స్టైలిష్‌గా సూపర్ హీరో పాత్రను డిజైన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని నిర్మించడానికి మైత్రీ మూవీ మేకర్స్ ముందుకొస్తుంది. దీంతో పాటు మరికొన్ని అగ్ర నిర్మాణ సంస్థలో పోటీ పడుతున్నాయి.




బాలయ్యను ఒప్పించిన ఒకే ఒక్కడు !

Loading..