Advertisementt

షోయ‌బ్ మాలిక్‌కు నాలుగో పెళ్లి

Sat 28th Feb 2026 09:22 AM
shoaib malik  షోయ‌బ్ మాలిక్‌కు నాలుగో పెళ్లి
Shoaib Malik Fourth marriage with Laiba Khan షోయ‌బ్ మాలిక్‌కు నాలుగో పెళ్లి
Advertisement
Ads by CJ

పాకిస్తానీ క్రికెట‌ర్, సానియా మిర్జా మాజీ భ‌ర్త షోయ‌బ్ మాలిక్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారా? అంటే అవున‌నే ప్ర‌చారం సాగుతోంది. లైబా ఖానే అనే న‌టితో షోయ‌బ్ అత్యంత స‌న్నిహితంగా ఉంటున్నార‌ని పుకార్లు షికార్ చేస్తున్నాయి. అయితే ఈ వార్త‌లు నిజ‌మా? అన్న‌ది ఆరా తీస్తే.. షోయ‌బ్ పై సాగుతున్న‌ది అస‌త్య ప్ర‌చారం అంటూ కొట్టి పారేస్తున్నారు.

 

షోయ‌బ్ త‌న భార్య సానియా మిర్జాకు విడాకులిచ్చాక పాకిస్తానీ న‌టి స‌నా జావేద్ ని 2024లో పెళ్లాడాడు. ప్ర‌స్తుతం  ఈ జంట ఆనందంగా ఉంది. ఈ ఇద్ద‌రూ గొడ‌వ‌లు ప‌డిన‌ట్టు, విడిపోయిన‌ట్టు ఎక్క‌డా క‌థ‌నాలు రాలేదు. అయితే కొన్ని పాకిస్తానీ వ్య‌తిరేక మీడియాలు షోయ‌బ్ పై త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురితం చేయ‌డం వ‌ల్ల‌నే ఇప్పుడు ఇలాంటి పుకార్ పుట్టింద‌ని టాక్ వినిపిస్తోంది. షోయ‌బ్ త‌న మొద‌టి భార్య అయేషా సిద్ధిఖీని పెళ్లాడి విడాకులిచ్చిన‌ట్టు 2010లో తెలిసింది. 13 ఏళ్ల కాపురం, ఒక బిడ్డ‌కు తండ్రి అయిన‌ త‌ర్వాత సానియాకు షోయ‌బ్ త‌లాఖ్ చెప్పాడు. ఆ త‌ర్వాత న‌టి స‌నా జావేద్ ని పెళ్లాడాడు. అయితే ఈ రెండు పెళ్లిళ్ల మ‌ధ్య మ‌రో పెళ్లి అయింద‌న్న పుకార్ ఉన్నా దానికి బ‌ల‌మైన ఆధారం లేదు. ప్ర‌స్తుతం లైబా ఖాన్ ని పెళ్లాడాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే లైబా ఖాన్ ఈ ఏడాది ఆరంభంలోనే వ్యాపార‌వేత్త జ‌వాద్ ని మ‌దీనాలో పెళ్లాడారు. లైబా - జ‌వాద్ జంట‌ బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు షోయబ్ తో ముడిపెడుతూ పుకార్లు రావ‌డం త‌న కాపురానికి ఇబ్బంది. అయితే ఇవ‌న్నీ కేవ‌లం పుకార్లు మాత్ర‌మేన‌ని ఆధారాలు చెబుతున్నాయి. లైబాతో గ‌తంలో ఉన్న స్నేహం కార‌ణంగా కూడా షోయ‌బ్ ఈ ఆరోప‌ణ‌ల్ని ఎదుర్కొంటున్నాడ‌ని కొన్ని మీడియాలు చెబుతున్నాయి.

Shoaib Malik Fourth marriage with Laiba Khan:

cricketer Shoaib Malik set for fourth marriage

Tags:   SHOAIB MALIK
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ