Advertisementt

ఏపీలో సంజూ బాబా ఫిలింసిటీ

Sat 28th Feb 2026 08:42 AM
sanjay dutt film city in andhra pradesh  ఏపీలో సంజూ బాబా ఫిలింసిటీ
Sanju Baba Film city in AP ఏపీలో సంజూ బాబా ఫిలింసిటీ
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ వంటి దిగ్గ‌జాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సినిమా స్టూడియోలు నిర్మిస్తార‌ని ప్ర‌చారం సాగినా అవేవీ ఇక్క‌డ ప‌న‌వ్వ‌లేదు.. కానీ ఇప్పుడు బాలీవుడ్ నుంచి వ‌చ్చిన ఒక స్టార్ ఏపీలో ఫిలింసిటీ నిర్మాణం గురించి నారా లోకేష్ బాబుతో ముచ్చ‌టించారు. ఇది కొంచెం వినేందుకు విచిత్రంగా ఉన్నా కానీ ఇదే నిజం. టాలీవుడ్ సినీపెద్ద‌లు ఎవ‌రూ హైద‌రాబాద్ వ‌దిలి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి వ‌చ్చేందుకు సుముఖంగా లేర‌ని స‌న్నివేశం చెప్ప‌క‌నే చెప్పింది..

 

ఇలాంటి స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఒక భారీ ఫిలింసిటీ నిర్మాణం కోసం ఒప్పందం చేసుకునేందుకు బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడును క‌ల‌వ‌డం చ‌ర్చ‌గా మారింది. అభివృద్ధి చెందే చోట పెట్టుబ‌డి పెట్టేందుకు ముందుకు వ‌చ్చిన సంజూ భాయ్ తెలివైన నిర్ణ‌యం తీసుకున్నారంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. చాలామంది టాలీవుడ్ స్టార్లు చేయని మంచి ప్ర‌య‌త్నం చేస్తూ తెలుగువారంద‌రి నోళ్ల‌లో నానుతున్నాడు. షూటింగులకు సింగిల్ విండో అనుమ‌తులు స‌హా తాను చేప‌ట్టే ప్రాజెక్టుల‌కు ఇన్సెంటివ్ లు కోరేందుకు సంజూభాయ్ నేరుగా లోకేష్ ని క‌లిసారు. ఇన్సెంటివ్ ల విష‌యంలో సంతృప్తిగా ఉన్నార‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి. అయితే సంజూ భాయ్ ఫిలింసిటీని నిర్మిస్తారా?  లేక ఇంకేదైనా ప్ర‌ణాళిక‌లు ఉన్నాయా? అన్న‌ది వేచి చూడాల్సిందే. 

Sanju Baba Film city in AP:

Sanju Baba Film city in Andhra Pradesh

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ