దర్శకుడు మారుతి తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అనగానే ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మారుతి తో సినిమా రిజెక్ట్ చెయ్యమని ప్రభాస్ తో పెద్ద యుద్ధమే చేసారు. ప్రభాస్ ఎందుకు మారుతి కి అవకాశం ఇచ్చాడో అని ప్రభాస్ ఫ్యాన్స్ మధనపడని రోజు లేదు. దానితో మారుతి డైరెక్ట్ గా ప్రభాస్ సినిమా అప్ డేట్స్ ఇవ్వకుండా తనకు సన్నిహిత మిత్రులతో సోషల్ మీడియా ట్వీట్స్ వేయిస్తూ.. రాజసాబ్ ఫస్ట్ లుక్ సమయమొచ్చేసరికి కాస్త ఫ్యాన్స్ ని కూల్ చేసాడు.
ఆతర్వాత రాజసాబ్ అప్ డేట్స్ ని సన్నిహితులతో ట్వీట్లు వేయిస్తూనే సినిమా రిలీజ్ సమయానికి తనపై నెగివిటి పోగొట్టుకున్నాడు. సినిమా రిలీజ్ అయ్యింది, ప్లాప్ అయ్యింది. అక్కడ కూడా మారుతి తన తెలివి చూపిస్తూ తనకు సన్నిహితంగా ఉన్నవారితో తన తప్పు లేదు, అసలు అలాంటి స్క్రిప్ట్ ని ప్రభాస్ ఎందుకు ఒప్పుకోవాలి అనే అర్ధం వచ్చేలా ట్వీట్లు వేయించి న్యూస్ లు రాయించాడు.
ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకి మొహం చేటేసిన మారుతి మరోసారి తన లీక్స్ స్టార్ట్ చేసాడు. రాజసాబ్ తర్వాత మారుతి తో సినిమా చేసే హీరో పై అందరిలో ఆసక్తి స్టార్ట్ అయ్యింది. మారుతి ని నమ్మి అవకాశం ఇచ్చే హీరో ఎవరా అని చూస్తుంటే.. మళ్ళీ మారుతి సన్నిహితులే సోషల్ మీడియాలో మారుతి నెక్స్ట్ రామ్ లేదంటే వరుణ్ తేజ్ ల వైపు చూస్తున్నాడు, వారితో సినిమా మారుతి నెక్స్ట్ మూవీ ఉండే అవకాశం ఉంది అంటూ వార్తలు వండడం మొదలు పెట్టారు.
అసలు కొన్నాళ్ళు మారుతి బయట కనిపించడు అనుకుంటే.. ఇలా సైలెంట్ గా తన లీక్స్ వదులుతూ తదుపరి ప్రాజెక్టు ని లైన్ లో పెట్టుకుంటున్నారు. అది చూసి మారుతి తెలివి మాములుగా లేదుగా అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు.




ప్రేక్షకుల వేగాన్ని అందుకోలేకపోతున్నారు
Loading..