Advertisementt

ప్రేక్షకుల వేగాన్ని అందుకోలేకపోతున్నారు

Fri 20th Feb 2026 10:28 AM
ott changed audience mindset  ప్రేక్షకుల వేగాన్ని అందుకోలేకపోతున్నారు
OTT Changed audience Mindset ప్రేక్షకుల వేగాన్ని అందుకోలేకపోతున్నారు
Advertisement
Ads by CJ

ఓటీటీ లు పాపులర్ అయ్యాక ప్రేక్షకుల మైండ్ సెట్ లో మార్పులొచ్చాయి. కొత్త కొత్త కథలను, కొత్త కంటెంట్ ని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. థియేటర్స్ లో ఎలా ఉన్నా ఓటీటీ కంటెంట్ విషయంలో ప్రేక్షకుల అభిరుచి మారింది. నిన్నటివరకు క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఆడియన్స్ ఇష్టపడేవారు.  

కానీ ఇప్పుడు వారికి అవి రొటీన్ గా అనిపిస్తున్నాయి. ప్రతివారం కొత్త కంటెంట్ కోసం వెతుకుతున్నారు. థియేటర్స్ లో నెలకో ఇంట్రెస్టింగ్ సినిమా వస్తుంటే.. అది మూడు, లేదా నాలుగు వారాల లోపు ఓటీటీకి వస్తుంది. మరోపక్క వెబ్ సీరీస్ లు కూడా ఆచి తూచి వస్తున్నాయి. ప్రేక్షకులు వీకెండ్ వస్తే చాలు ఓటీటీ లో ఆసక్తిగల కంటెంట్ కోసం ఎగబడుతున్నారు.

కానీ మేకర్స్ ప్రేక్షకుల వేగాన్ని అందుకోలేకపోతున్నారు. సినిమాల కన్నా వెబ్ సీరీస్ లు చెయ్యడానికే సమయం ఎక్కువ పడుతుంది. రాజ్ అండ్ డీకే ద్వయం నుంచి రావాల్సిన సీక్వెల్స్ ఉన్నాయి, అలాగే ఇంకా చాలా వెబ్ సీరీస్ ల పార్ట్ 2 లు పెండింగ్ ఉన్నాయి. అవి అనుకున్న సమయానికి అందుబాటులోకి రావడం లేదు.

ఆడియన్స్ సెర్చ్ చేస్తున్నారు, కొత్త కొత్త కంటెంట్స్ కోసం, కానీ ఓటీటీలు మాత్రం ఆడియన్స్ వేగాన్ని అందుకోలేకపోతున్నాయి. 

OTT Changed audience Mindset:

Directors Failing to catch Audience Pulse

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ