సిల్లీ కామెడీ వర్కౌట్ అవ్వదు గురూ..

Fri 20th Feb 2026 08:25 AM
anudeep  సిల్లీ కామెడీ వర్కౌట్ అవ్వదు గురూ..
Funky Failure A lesson for Anudeep సిల్లీ కామెడీ వర్కౌట్ అవ్వదు గురూ..

బుల్లితెరపై, అలాగే ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లోను, షోస్ లో వర్కౌట్ అయిన కామెడీ సిల్వర్ స్క్రీన్ పై వర్కౌట్ అవ్వదు అని దర్శకుడుగా అనుదీప్  తెరకెక్కించిన ఫంకీ నిరూపించింది. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ఫంకీ కామెడీని ఆడియన్స్ రిజెక్ట్ చేసారు. అనుదీప్ బుల్లితెర షోస్ లోను, ఇంటర్వూస్ లో చేసిన కామెడీని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ సినిమాకొచ్చేసరికి తిరస్కరించారు.

అనుదీప్ ఎప్పుడు తన చదువు గురించి, ఇంకా ఫ్రెండ్స్, పెళ్లి గురించి ఇలా కామెడీగా మాట్లాడుతుంటాడు, అది జాతి రత్నాలు సమయంలో వర్కౌట్ అయినా.. ఇప్పుడు ఫంకీ విషయానికి వచ్చేసరికి తేడా కొట్టింది. అలాంటి సిల్లీ కామెడీని ప్రేక్షకులు తీసుకోవడం లేదు, ఎంజాయ్ చెయ్యడం లేదు.

సిల్లీ గా సినిమా చేసాం, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, వచ్చి నవ్వుకోండి అంటే ఆడియన్స్ ఎర్రిపప్పలు కాదు, అనుదీప్ మాత్రమే కాదు ఈ కోవలో ఉన్న మరికొందరు డైరెక్టర్స్ కూడా ఈ విషయాన్ని గమనించాలి, గ్రహించాలి 

Funky Failure A lesson for Anudeep:

Funky Failure A Wake-up Call For Anudeep

Tags:   ANUDEEP