బిర్లా వంశపు వారసురాలు, ప్రముఖ గాయని, వ్యాపారవేత్త అనన్యా బిర్లా ఇప్పుడు సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుండటం హాట్ టాపిగ్గా మారింది. అనన్యా బిర్లా తన సొంత ప్రొడక్షన్ హౌస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ఉన్న గ్లోబల్ ఇమేజ్ దృష్ట్యా, బిర్లా గ్రూప్ వంటి దిగ్గజ సంస్థ సినిమా రంగంలోకి రావడానికి అతడే సరైన ఛాయిస్ అని వారు భావిస్తున్నట్టు టాక్.
అనన్యా బిర్లా కేవలం ఒక సినిమాకే పరిమితం కాకుండా, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక బలమైన ముద్ర వేయాలని చూస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ ప్రమాణాలతో కూడిన కంటెంట్‌ను ఇండియన్ స్క్రీన్‌పై తీసుకురావడం ఈ ఔత్సాహిక పారిశ్రామిక వేత్త ప్రధాన ఉద్దేశ్యం. అనన్య బిర్లా అంతర్జాతీయ గాయనిగా కళారంగానికి ఇప్పటికే సుపరిచితురాలు కావడం వినోదరంగానికి ప్లస్ కానుంది. RRR తర్వాత ఎన్టీఆర్‌కు ఉన్న ఇంటర్నేషనల్ అప్పీల్ వల్లే బిర్లా వంటి పెద్ద సంస్థలు అతడితో జతకట్టాలని చూస్తున్నట్టు గుసగుస వినిపిస్తోంది.
ఆదిత్యా బిర్లా గ్రూప్ భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒకటి. అనన్యా బిర్లా తండ్రి కుమార మంగళం బిర్లా నికర ఆస్తి ప్రఖ్యాత ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం సుమారు 23.5 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో సుమారు రూ.1,95,000 కోట్లు. బిర్లా గ్రూప్ మొత్తం ఆస్తుల విలువ 65 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో సుమారు రూ.5,40,000 కోట్లు.




పెద్దికి దిమ్మతిరిగే డిజిటల్ డీల్
Loading..