Advertisementt

ఎన్టీఆర్-నీల్ 26 సాధ్యమేనా

Sat 14th Feb 2026 11:19 AM
ntr - neel  ఎన్టీఆర్-నీల్ 26 సాధ్యమేనా
Can NTR - Neel Make It In Time ఎన్టీఆర్-నీల్ 26 సాధ్యమేనా
Advertisement
Ads by CJ

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ 2026 లో విడుదల సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ జోర్డాన్ లోని అద్భుతమైన లొకేషన్స్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో మలయాళ స్టార్ హీరో తోవినో థామస్ తలపడబోతున్నాడని, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్-తోవినో పై క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తారని టాక్.

ఈ భారీ షెడ్యూల్ తర్వాత తిరిగి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటిలో వేసిన స్పెషల్ సెట్ లో ఎన్టీఆర్-నీల్ షూటింగ్ ఉంటుంది అంటున్నారు. ఇదంతా బానే ఉంది.. అసలు ఎన్టీఆర్-నీల్ కాంబో అప్ డేట్ ఇవ్వకుండా మేకర్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎంతగా వెయిట్ చేయిస్తున్నారు అంటే గత ఏడాది మే 20 కి రావాల్సిన ఫస్ట్ లుక్ తొమ్మిది నెలలైనా ఇవ్వకుండా వెయిట్ చేయిస్తున్నారు.

అసలు ఈ ఏడాది ఎన్టీఆర్-నీల్ మూవీ వస్తుందా అనే ధర్మ సందేహంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టుమిట్టాడుతున్నారు. ఇక మేకర్స్ ఈ న్యూస్ లకు ఎప్పుడు చెక్ పెడతారో తెలియదు కానీ.. ఈచిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీ రోల్ లో కనిపించబోతున్నారు అనే న్యూస్ ఉంది. 

Can NTR - Neel Make It In Time:

Why NTR - Neel Film Getting delayed

Tags:   NTR - NEEL
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ