Advertisementt

పూరిలా అత‌డు మ‌రో ఛాన్స్ తీసుకోడా?

Thu 12th Feb 2026 12:06 PM
lokesh kanagaraj  పూరిలా అత‌డు మ‌రో ఛాన్స్ తీసుకోడా?
Difference between Lokesh kanagaraj and Puri Jagannath పూరిలా అత‌డు మ‌రో ఛాన్స్ తీసుకోడా?
Advertisement
Ads by CJ

ద‌ర్శ‌కుడిగా పూరి జ‌గ‌న్నాధ్ ఎలాంటి విజ‌యాలు ఇండ‌స్ట్రీకి అందించాడో చెప్పాల్సిన ప‌నిలేదు. ఫాంలో ఉన్నంత కాలం డైరెక్ట‌ర్ల‌లో అత‌డో బ్రాండ్ గా కొన‌సాగాడు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో డైరెక్ట‌ర్లు అంతా ఒక ఎత్తైతే?  పూరి ఒక్క‌డే మరో ఎత్తులా నిలిచారు. అంత‌టి పూరి క‌థ‌నే మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

చిరంజీవి కంబ్యాక్ అనంత‌రం 151వ చిత్రాన్ని పూరితో చేయాల‌నుకున్నారు. ఈక్ర‌మంలో పూరిని పిలిచించి చిరంజీవి ఆఫ‌ర్ ఇచ్చారు. ఆ మాట‌కు పూరి ఆటోజానీ క‌థ‌ను సిద్దం చేసి వినిపించాడు. కానీ ద్వితియార్ధంలో చిరంజీవి సంతృప్తి చెంద‌క‌పోవ‌డంతో?  ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌లేదు. సాధ‌ర‌ణంగా ఇలాంటి ప‌రిస్థి తుల్లో క్రియేటివ్ డిఫ‌రెన్సెస్  తలెత్తాయ‌ని డైరెక్ట‌ర్లు ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంటారు.

హీరో వైపు మ‌ళ్లీ చూడాలంటే ఆలోచిస్తారు. ఆ హీరోతో వ‌ర్కౌట్ అవ్వ‌ద‌ని వ‌దిలేస్తారు. కానీ పూరి జ‌గ‌న్నాధ్ అలా కాదు. అన్న‌య్య తో సినిమాను ఓ డ్రామ్ గా భావించాడు. 151 కాక‌పోతే 152 అదీ కాక‌పోతే 160వ సినిమా చేస్తాను.

ఏదో రోజు క‌చ్చితంగా చిరంజీవితో  సినిమా తీసే రిటైర్ అవుతాన‌న్నాడు. అంటే ఒక రిజెక్ష‌న్ ని పూరి ఎంత పాజిటివ్ గా తీసుకుంటాడు? అన్న‌ది అప్పుడే జ‌నాల‌కు అర్ద‌మైంది.

కానీ కోలీవుడ్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ టైపు కాద‌ని తెలుస్తోంది. ర‌జ‌నీకాంత్-క‌మ‌ల్ హాస‌న్ పిలిచి అవ‌కాశం ఇస్తే?   వారిద్ద‌రు క‌థ న‌చ్చ‌లేదు అనే స‌రికి లోకేష్ నిరుత్సాహ‌ప‌డ్డాడు.  వారిద్ద‌రి ఆలోచ‌న‌ల‌కు తాను భిన్నంగా ఉన్నాన‌ని ప్రాజెక్ట్ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించాడు. అంతే గానీ ఇద్ద‌రు లెజెండ్స్ తో ప‌ని చేయ‌డం కోసం మ‌ళ్లీ మ‌రో క‌థ‌తో అప్రోచ్ అవుతాను అనే మాట లోకేష్ నోట రాలేదు. 

Difference between Lokesh kanagaraj and Puri Jagannath:

Lokesh kanagaraj should Learn From Puri Jagannath

Tags:   LOKESH KANAGARAJ
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ