Advertisementt

ఫంకీ - నాగవంశీకి బిగ్ ఛాలెంజ్

Thu 12th Feb 2026 10:37 AM
funky  ఫంకీ - నాగవంశీకి బిగ్ ఛాలెంజ్
Funky A big Challenge For Nagavamsi ఫంకీ - నాగవంశీకి బిగ్ ఛాలెంజ్
Advertisement
Ads by CJ

 

యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ అంటే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజు. కారణం ఆయన మాట తీరు. గత ఏడాది వరస డిజాస్టర్ తో సతమతమైన ఈ కుర్ర నిర్మాత నాగవంశీ కి ఈ ఏడాది ఆరంభంలోనే అనగనగా ఒక రాజు అంటూ మాంచి హిట్టు దక్కింది. అనగనగ ఒకరాజు చిత్రంతో నాగవంశీ రూ.100 కోట్లు ఖాతాలో వేసుకున్నాడు.  

అయితే అక్కడ నవీన్ పోలిశెట్టి యావరేజ్ సినిమాని హిట్టు బాట పట్టించడమే కాదు తన ప్రమోషన్స్ రూ.100 కోట్ల క్లబ్బులో అనగనగ ఒక రాజు ని చేరేలా చెయ్యడంలో సక్సెస్ అయ్యాడు. కారణం నవీన్ పోలిశెట్టి ఊపు, ఆయన డిఫరెంట్ ప్రమోషన్స్ అన్ని అనగనగ ఒకరాజు ని సేవ్ చెయ్యడం, సంక్రాంతి సీజన్ లో ఈ సినిమా ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యింది.

కానీ నిర్మాత నాగవంశీ కి అసలైన ఛాలెంజ్ రేపు శుక్రవారం విడుదల కాబోతున్న ఫంకీ. హీరో విశ్వక్ సేన్ అసలే ప్లాప్ లో ఉన్నాడు. అటు కేవీ అనుదీప్ కూడా ప్రిన్స్ తో డిజాస్టర్ చూసాడు, ఇక్కడ విశ్వక్ సేన్ ఓపెనింగ్స్ రాబట్టగలడా, ఫంకీ కి ఓపెనింగ్స్ వస్తాయా, పెద్ద బ్యానర్ సితార, సితార బ్యానర్ ని చూసి ప్రేక్షకుడు రావొచ్చు.

కామెడీ ఎంటర్టైనర్ గా కనిపిస్తున్న ఫంకీ పై ఆడియన్స్ లో ఎంత ఆసక్తి ఉంది అనేది ఓపెనింగ్స్ చూస్తే అర్ధమవుతుంది. మరి ఫంకీ చిత్రం నాగవంశీకి బిగ్ ఛాలెంజ్ అనే చెప్పాలి.    

Funky A big Challenge For Nagavamsi:

Can Nagavamsi Continue Success Streak With Funky

Tags:   FUNKY
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ