2026 లో క్రేజీ హీరోల సినిమాలు విడుదల కావడం లేదు. స్టార్స్ పోటీపడడం లేదు అని ప్రేక్షకులు చాలా ఫీలయ్యారు. ప్రభాస్ రాజాసాబ్ తో బోణి కొట్టిన ఈ సంక్రాంతి ఐదు సినిమాల్తో కళకళలాడింది. ప్రభాస్ రాజసాబ్ జనవరి 9 కి వస్తే ఆ సినిమాకి సో సో టాక్ వచ్చినా రాజసాబ్ కి ప్రభాస్ స్టామినా కలెక్షన్స్ తెచ్చింది. ఇక జనవరి 12 న విడుదలైన మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు కి సూపర్ హిట్ టాక్ వచ్చేసింది.
సంక్రాంతి రేస్ లో మొదటి హిట్ గా మన శంకర వరప్రసాద్ గారు నిలవగా.. ఆతర్వాత రోజు వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి కి కూడా హిట్ టాక్ వచ్చేసింది. రవితేజ చాన్నాళ్లకు హిట్ కళతో కనిపించాడు. ఆతర్వాత రోజు భోగి రోజు పోటీపడిన కుర్ర హీరోలు నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ లు కూడా ఈ సంక్రాంతికి హిట్ కళతో కనిపించారు.
అనగనగ ఒక రాజు, నారి నారి నడుమ మురారి చిత్రాలకు కూడా హిట్ టాక్ పడిపోవడంతో ఈ సంక్రాంతికి విడుదలైన ఐదు సినిమాల్లో మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాయులకు విజ్ఞప్తి, అనగనగ ఒకరాజు, నారి నారి నడుమ మురారి నాలుగు సినిమాలు ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్నాయి.




HIV వస్తుంది జాగ్రత్త - దిశా పటానీకి హెచ్చరిక
Loading..