Advertisementt

శంకర వర ప్రసాద్ గారు ట్రైలర్ డేట్ ఫిక్స్

Fri 02nd Jan 2026 07:18 PM
mana shankara vara prasad garu  శంకర వర ప్రసాద్ గారు ట్రైలర్ డేట్ ఫిక్స్
Mana Shankara Vara Prasad Garu Trailer on శంకర వర ప్రసాద్ గారు ట్రైలర్ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హైలీ యాంటిసిపేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్, ఆకట్టుకునే ప్రచార కార్యక్రమాలతో భారీ సంచలనం సృష్టిస్తోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. మీసాల పిల్ల పాట 100 మిలియన్లకు పైగా వ్యూస్ దాటగా, శశిరేఖ పాట దాదాపు 40 మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. చిరంజీవి, వెంకటేష్ నటించిన  పాట సంక్రాంతి అదిరిపోద్ది ఒక ఫెస్టివల్ సాంగ్ లా మారింది.

మన శంకర వర ప్రసాద్ గారు చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ ట్రైలర్‌ను జనవరి 4న విడుదల చేయనున్నారు. ట్రైలర్ పోస్టర్‌లో చిరంజీవి తెల్లటి చొక్కా, ముదురు రంగు ప్యాంటు ధరించి, ఒక మోకాలిపై కూర్చుని, చేతిలో షాట్‌గన్ పట్టుకుని, చుట్టూ యాక్షన్‌లో ఉన్న వ్యక్తుల మధ్య కనిపించడం అదిరిపోయింది.

అనిల్ రావిపూడి ఇప్పటికే ఇది హై-వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు క్రైమ్ డ్రామా షేడ్స్ కలిగిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందని హింట్స్ నేపథ్యంలో ట్రైలర్‌  కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12, 2026న థియేటర్లలోకి గ్రాండ్‌గా  విడుదల కానుంది.

ఈ సినిమాకు సంబంధించిన యూఎస్‌ఏ అడ్వాన్స్ సేల్స్ అద్భుతంగా ప్రారంభమయ్యాయి.  వేగంగా100K నమోదు కావడం, ఓవర్సీస్ మార్కెట్‌లో సినిమాపై ఉన్న మ్యాసీవ్ బజ్‌ను స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

Mana Shankara Vara Prasad Garu Trailer on:

Mana Shankara Vara Prasad Garu Theatrical Trailer Launch On January 4th

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ