తీసిన సినిమా ప్లాప్ అయితే? అది ప్రేక్షకుల లోపమని సమర్ధించుకునే దర్శకులు కొంతమందైతే తమ కారణం గానే ప్లాప్ అయిందని ఓపెన్ గా ఒప్పుకునే వాళ్లు మరికొందరు. ఇలా అంగీకరించాలంటే గట్స్ ఉండాలి. ఇలా ప్లాప్ ని అంగీకరించడం అన్నది అందరూ చేయలేరు. ఆ మధ్య `థగ్ లైఫ్` సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ప్లాప్ అయింది. మూడు దశాబ్దాల తర్వాత కమల్ హాసన్-మణిరత్నం కలిసి చేసిన ప్రాజెక్ట్ కావడంతో? అభిమాను లంతా ఎంతో ఆశగా థియేటర్ కు వెళ్తే ఓ రొటీన్ సినిమా ఇచ్చి ప్రేక్షకుల్ని నిరుత్సాహపరిచారు.
సినిమాపై నెగిటివ్ రివ్యూలు..విమర్శలు వచ్చాయి. దీంతో మణిరత్నం దిగొచ్చి ప్రేక్షకుల్ని క్షమాణలు కోరారు. మీ కోసం మరింత ఉత్తమంగా పని చేస్తానని..తన పని తనాన్ని మెరుగు పరుచుకుంటానన్నారు. ఇలా మణిరత్నం ఏ సినిమా ప్లాప్ విషయంలో స్పందించలేదు. `థగ్ లైఫ్` విషయంలో ఆ ఫేజ్ ని చూసారు. అనంతరం లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన `లియో` కూడా భారీ అంచనాల మద్య రిలీజ్ అయి ప్లాప్ అయింది. దీంతో దళపతి విజయ్ అభిమానులు ఎంతో నిరుత్సాహపడ్డారు.
`విక్రమ్` తర్వాత చేసిన సినిమా కావడంతో? `లియో` లో ఏదో అద్భుతం ఉంటుందని గెస్ తో థియేటర్ కు వెళ్తే రొటీన్ సినిమా చేసి షాక్ ఇచ్చాడు. కానీ సినిమా 500 కోట్ల వసూళ్లను సాధించింది. `లియో` ప్లాప్ విషయంలో అప్పట్లోనే లోకేష్ దిగొచ్చి క్షమాపణలు అడిగాడు. తాజాగా రిలీజ్ అయిన `కూలీ` పరిస్థితి కూడా అంతే. రజనీకాంత్ నటించిన ఈ సినిమా కూడా 500 కోట్ల వసూళ్లను సాధించిన చిత్రమే. కానీ సినిమా ఫెయిలైంది.
దర్శకులు లోకేష్ కనగరాజ్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా ఈ ప్లాప్ కు తానే బాధ్యుడనని లోకేష్ ప్రకటించాడు. తర్వాత చేసే సినిమాల విషయంలో తప్పిదాలు సరిద్దుకుంటాన్నాడు. సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చినా? ట్రోల్స్ వచ్చినా? 500 కోట్లు రాబట్టింది కాబట్టి తాను అంతే బాధ్యతగా సినిమా చేయాలన్నారు. తాను అంచనాలు ఆధారంగా కథలు రాయలేనని.. రాసుకున్న కథలోని పాత్రలు ప్రేక్షకుల అంచనాలు అందుకుంటే?ఆనందిస్తానన్నారు. ఓపెన్ గా ఇలా ప్రేక్షకుల్ని క్షమాపణలు అడగలన్నా దమ్ముండాలి. అది ఆ ఇద్దరి లో పుష్క లంగా ఉంది.




1000 కోట్ల హీరోయిన్ టాలీవుడ్ డెబ్యూ
Loading..