ఓజీ తర్వాత నిధి మరో పాన్ ఇండియా చిత్రంలో నటించింది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ సరసన `ది రాజా సాబ్` చిత్రంలో జాక్ పాట్ అందుకుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 9న థియేటర్లలో అత్యంత భారీగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఓజీలో నిధి అందచందాలు, నటప్రదర్శనకు ప్రజలు ఫిదా అయిపోయారు. ఇప్పుడు ది రాజా సాబ్ లో అంతకుమించి అందంగా కనిపిస్తోంది. కొన్ని పాటలు, సన్నివేశాల్లో నిధి ముగ్ధ మనోహర రూపానికి మైండ్ బ్లాంక్ అయిపోతోంది.
శనివారం సాయంత్రం `ది రాజా సాబ్` వేదిక కోసం ఉల్లిపొర లాంటి డిజైనర్ చీర- హాఫ్ షోల్డర్ టాప్ లో ముస్తాబై ఎంతో గ్లామరస్ గా కనిపించింది. అయితే నిధి అగర్వాల్ అందచందాలకు ముగ్ధులు అయిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ నిధిని తమ ఫేవరెట్ హీరో పెళ్లాడితే చాలా బావుంటుందని కూడా సూచనలు ఇవ్వడం, ఆ విషయాన్ని యాంకర్ సుమ వేదిక వద్ద హైలైట్ చేయడం ఆసక్తిని కలిగించింది.
యాంకర్ సుమ నేరుగా నిధి వద్దకు వెళ్లి మరీ ప్రశ్నించింది. ``నిధి పాపను పెళ్లి చేసుకోవాలంటే ఏ వృత్తిలో ఉండాలి? ఎంత ఆస్తి ఉండాలి? ఎలా ఉండాలి? అని ప్రభాస్ ఫ్యాన్స్ అడుగుతున్నారని సుమ చెప్పారు. దానికి నిధి కూడా అంతే స్మార్ట్ గా జవాబివ్వడం వేదిక వద్ద ఆకర్షించింది. నిధిని పెళ్లాడాలంటే `లవ్` అనే వృత్తిలో ఉండాలి! అని జవాబిచ్చింది ఈ కన్నడ బ్యూటీ. నిధి కోరుకున్నట్టే ఇప్పుడు తన సీక్రెట్ ప్రేమికులు మరింత డీప్ గా లవ్ అనే వృత్తిని చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు `ది రాజా సాబ్` విడుదలై వెళ్లిన తర్వాత కూడా లవ్ అనే వృత్తిని విడిచిపెట్టలేరేమో!




దమ్మున్నోళ్లు మాత్రమే ఇలా చేయగలరు
Loading..