Advertisementt

చిరు-వెంకీ కలిసి స్టెప్స్ వేస్తె..

Fri 26th Dec 2025 07:20 PM
mana shankara vara prasad garu  చిరు-వెంకీ కలిసి స్టెప్స్ వేస్తె..
Mega Victory Mass Song- Biggest Celebration Anthem, From MSPG చిరు-వెంకీ కలిసి స్టెప్స్ వేస్తె..
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలిసి నటిస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మ్యాసీవ్ అప్‌డేట్ ఇప్పుడు వచ్చేసింది.

ఈ చిత్రంలోని థర్డ్ సింగిల్ మెగా విక్టరీ మాస్ సాంగ్ ను డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమోను రేపు రిలీజ్ చేయనున్నారు.

సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ అదిరిపోయింది. ఎనర్జీతో నిండిన ఈ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఇద్దరూ స్టైలిష్ డాన్స్ పోజుల్లో అదరగొట్టారు. బ్యాక్‌గ్రౌండ్‌లో డ్యాన్సర్లతో కలిసి పూర్తి సెలబ్రేషన్ వైబ్స్‌ను క్రియేట్ చేశారు. డెనిమ్ లుక్, సన్‌గ్లాసెస్‌తో చిరంజీవి మెగా స్వాగ్ తో కనిపిస్తే, రెడ్ జాకెట్‌లో వెంకటేశ్ స్టన్నింగ్‌గా కనిపిస్తున్నారు. ఇద్దరి మాస్ అప్పీల్, స్వాగ్ పీక్స్‌లో ఉన్నాయి.

ఈ సాంగ్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఆంథమ్ గా మ్యూజిక్ చార్ట్స్‌ను షేక్ చేయబోతుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ ని గ్రాండ్ గా స్టార్ట్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ సాంగ్.

Mega Victory Mass Song- Biggest Celebration Anthem, From MSPG:

Mega Victory Mass Song- Biggest Celebration Anthem, From Mana Shankara Vara Prasad Garu 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ