ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ముంబైలో మొదలైన షూటింగ్ నిరవధికంగా జరుగుతోంది. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తయింది. టెక్నికల్ స్టోరీ అయినా? బన్నీ-అట్లీ స్పీడ్ తో ఇదే ఏడాది సినిమా రిలీజ్ అవుతుందని తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. ఇంత వరకూ అట్లీ తెరకెక్కించిన సినిమాల వేటి రిలీజ్ కు పెద్దగా సమయం పట్టలేదు.
చెప్పిన సమయానికే రిలీజ్ చేసాడు. ఈ నేపథ్యంలో బన్నీ సినిమా కూడా ఏడాది చివర్లో రిలీజ్ ఖాయమని వార్త లొస్తున్నాయి. కానీ వికీ సమాచారం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈ చిత్రం ఏకంగా 2028లోనే ప్రేక్షకుల ముందుకొచ్చేదిగా కనిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం తెలియాల్సి ఉంది. మేకర్స్ మాత్రం ఇంత వరకూ రిలీజ్ తేదీని ప్రకటించలేదు. 2026 లో రిలీజ్ అవుతుందా? 2027 రిలీజ్ అవుతుందా? అని ఎలాంటి వివరాలు అధికారికంగా బయటకు రాలేదు.
ప్రాజెక్ట్ మొదలైన నాటి నుంచి 2026 ఏడాది చివర్లో రిలీజ్ ఉండొచ్చు? అన్నది నెట్టింట జరుగుతోన్న ప్రచారం. ఇప్పుడు అందుకు భిన్నమైన ప్రచారం ఊందపుకున్న నేపథ్యంలో? అందులోనూ వాస్తవం లేకపోలేదు అన్నది కొందరి వాదన. ఈ చిత్రాన్ని అట్లీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. వరల్డ్ మొత్తం కనెక్ట్ అయ్యే ఓ టెక్నికల్ స్టోరీ అని దీనిలో భాగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతుందని భావిస్తున్నారు.
సాధారణంగా విజువల్ ఎఫెక్స్ట్, సీజీ వర్క్ ఎక్కువ సినిమాలకు సమయం పడుతుంది. షూటింగ్ పూర్తయిన తర్వాత ఆరు నుంచి ఏడు నెలలు పాటు ఆ పనులకే సమయం కేటాయిస్తారు. షూటింగ్ తో పాటు సీజీ కూడా జరుగుతంటే? సమయం తక్కువ పడుతుంది. ఆలా కాకుండా 2028 రిలీజ్ అవుతుందా? మరి ఈ సినిమా విషయంలో అట్లీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నాడు? అన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేదు.




ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు 
Loading..