Advertisementt

సూప‌ర్ స్టార్ వార‌సురాలు 2026 లో గుడ్ న్యూస్

Sat 20th Dec 2025 09:54 AM
aishwarya rajinikanth  సూప‌ర్ స్టార్ వార‌సురాలు 2026 లో గుడ్ న్యూస్
Aishwarya Rajinikanth Next With Vishal సూప‌ర్ స్టార్ వార‌సురాలు 2026 లో గుడ్ న్యూస్
Advertisement
Ads by CJ

ఐశ్వ‌ర్యా ర‌జ‌నీకాంత్ `లాల్ స‌లామ్` త‌ర్వాత మ‌ళ్లీ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించని సంగతి తెలిసిందే. `లాల్ స‌లామ్`  రిలీజ్ అయి రెండేళ్లు స‌మీపిస్తున్నా?  కెప్టెన్ కుర్చీ ఎక్క‌లేదు. ధ‌నుష్ తో విడాకుల వ్య‌వ‌హారం కూడా ఐశ్వ‌ర్య కెరీర్ పై కాస్త ప్ర‌భావాన్ని చూపించింది.  పూర్తి స్థాయిలో సినిమాల‌పై దృష్టి పెట్ట‌లేక‌పోయారు. అయితే ఇప్పుడు వాట‌న్నింటి నుంచి బ‌య‌ట‌కొచ్చేసారు. ఫ్రెష్ మైండ్ తో  ఉన్నారు. ఈ నేప‌థ్యంలో  కొత్త ఏడాది కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించి అప్డేట్ ఇచ్చేలా క‌నిపిస్తున్నారు.

ఇటీవ‌లే  విశాల్ కు ఓ స్క్రిప్ట్ వినిపించారుట‌. ఇదీ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ అని స‌మాచారం. ఆమె గ‌త చిత్రాల‌కు భిన్నంగా ఈ క‌థ ఉంటుంద‌ని అంటున్నారు. స్క్రిప్ట్ న‌చ్చ‌డంతో విశాల్ కూడా పాజిటివ్ గా స్పందించాడ‌ని వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో అధికారికంగా అప్డ్ డేట్ వ‌చ్చే ఏడాది వ‌చ్చే అవ‌కాశం ఉంది. విశాల్ కూడా రెండేళ్ల‌గా యాక్టివ్ గా సినిమాలు చేయ‌ని సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది `మ‌ద‌గ‌జ రాజా`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు.

కానీ ఇది ఇప్ప‌టి సినిమా కాదు. అనివార్య కార‌ణాల‌తో డిలే అయిన ప్రాజెక్ట్ ఈ ఏడాది రిలీజ్ అయింది. ప్ర‌స్తుతం అత‌డు హీరోగా `ముగుదం`, `డిటెక్టివ్ 2` చిత్రాలు తెర‌కెక్కుతున్నాయి.ఈ  రెండు చిత్రాల‌ను స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్నాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ లు రిలీజ్ ఆల‌స్యం జ‌రుగుతుంది. ఈ నేప‌థ్యం స‌హా అనారోగ్యానికి గురి కావ డంతో?  ఇత‌ర ద‌ర్శ‌కుల‌కు ఇంత కాలం దూరంగా ఉన్నాడు.

తాజాగా సంపూర్ణ ఆరోగ్య‌వంతుడు కావ‌డంతో? మ‌ళ్లీ హీరోగా బిజీ అవుతున్నాడు.  ఈ క్ర‌మంలో ఐశ్వ‌ర్యా రాజేష్ స్టోరీకి ఒకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కోలీవుడ్ లో ఓ అగ్ర నిర్మాణ సంస్థ  నిర్మించ‌డానికి ముందుకొస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ వివ‌రాల‌న్నీ త్వ‌ర‌లో బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. 

Aishwarya Rajinikanth Next With Vishal:

  Aishwarya Rajinikanth To Make A fresh Start  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ